Cinema Gossips : ఆ యంగ్ హీరోల మధ్య కోల్డ్‌వార్.. ఖర్చు చేసి మరీ ట్రోల్స్ చేయిస్తున్నారట..!

- Advertisement -

Cinema Gossips : సినిమా ఇండస్ట్రీలో కాస్త అసూయ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల మధ్య గొడవలు, అసూయ, ఈగోలు ఎక్కువగా ఉంటాయి. ఇక అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ మధ్య వార్స్ నడుస్తూ ఉంటాయి. కానీ టాలీవుడ్‌లో మాత్రం ఇద్దరు అప్‌కమింగ్ హీరోల మధ్య సైలెంట్‌గా సీక్రెట్ వార్ నడుస్తోంది. ఈ వార్‌లో ఈ హీరోల ఫ్యాన్సే వారియర్స్. ఇద్దరు హీరోలు తీసిన సినిమాలు పది కూడా లేవు. కానీ వారి మధ్య లొల్లి మాత్రం కాస్త సీరియస్‌గానే నడుస్తోంది. వీళ్లు కథల ఎంపిక విషయంలో మంచి పట్టున్నవాళ్లు. యంగ్ అండ్ డైనమిక్ హీరోస్. ఈ ఇద్దరూ తమ సినిమాలకు తామే కథ, రైటింగ్ వర్క్స్ చూసుకుంటారు.

ఈ హీరోలిద్దరి సినీ కెరీర్‌లో ఓ సూపర్ కమర్షియల్ హిట్ పడింది. వీళ్లు తీసే సిన ఇద్దరికి కూడా ఒకొక్క కమర్షియల్ హిట్ పడింది… కొన్ని సినిమాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఇంకా ఈ ఇద్దరు టైర్ 2 హీరోల జాబితాలో చేరేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఈ సమయంలోనే వీళ్లమధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు బాహాటంగా ఎప్పుడు గొడవ పెట్టుకుంది లేదు. ఒకరిపై ఒకరు తప్పుడు ప్రచారం చేసిందీ లేదు. కానీ ఇద్దరు హీరోలు కూడా సైలెంట్‌గా ఒకరిపై ఒకరు వార్ చేసుకుంటున్నారు. దీనికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నట్లు టాక్.

Cinema Gossips
Cinema Gossips

సదరు హీరోలిద్దరు కూడా సొంతంగా ఓ సోషల్ మీడియా టీమ్ ఏర్పాటు చేసుకుని పనికట్టుకుని మరి అవతలి హీరోకు సంబంధించిన విషయాల పట్ల ట్రోల్స్ చేయిస్తున్నారట. భారీగా ఖర్చు చేసి మరీ ఒకరిపై మరొకరు పబ్లిక్‌లో నెగిటివ్ వార్తలు వ్యాప్తి చేయిస్తున్నారట. ఈ విషయం ఇప్పటి వరకు అధికారికంగా బయటకు రాలేదు కానీ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ పీక్స్‌లో జరుగుతోందని సమాచారం.

- Advertisement -

ఈ ఇద్దరిలో ఓ హీరో మూవీ కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఆ సమయంలో సదరు హీరోపై సినీ ఇండస్ట్రీలో నెగిటివ్ టాక్ నడిచింది. ఆ మూవీ నుంచి హీరో ఔట్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ హీరో స్థానంలో నటించేందుకు అతడికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్న మరో యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. చూస్తుంటే ఈ హీరో అవకాశం కోసం కాచి చూస్తున్నట్లు ఉందని సోషల్ మీడియాలో టాక్.

మొత్తానికి ఇద్దరు హీరోల మధ్య ఉన్న వైరం మెల్ల మెల్లగా పెరిగి పెద్దదవుతోంది. ముందు ముందు మరింతగా ఇద్దరు బాహాటంగానే విమర్శలు చేసుకునే స్థాయికి ఈ కోల్డ్ వార్ చేరుతుందా అనేది చూడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు వెయిట్ చేస్తున్నారు. ఆ ఇద్దరు హీరోలు ఇలాంటి గొడవలు మానుకొని సినిమాలపై దృష్టి పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here