Chiranjeevi : విశ్వంభర డైరెక్టర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ చిరంజీవి

- Advertisement -

Chiranjeevi : టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఆయనే రోల్ మోడల్. ఆయనంటే పడి చచ్చిపోతుంటారు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టి.. ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభ‌ర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుంది. ఇక ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. అభిమానులకు కూడా వాటిని చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా విశ్వంభరకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

షూటింగ్ సెట్స్ లో అందరూ ఉండగానే చిరంజీవి తన సినిమా డైరెక్టర్ వశిష్టపై కోపగించుకున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి కోపానికి కారణం ఏంటి.. అసలు సంగతేంటో ఒకసారి తెలుసుకుందాం. వశిష్ట ముందు చిరంజీవికి నెక్స్ట్ జరగబోయే సీన్ ఇదేనంటూ వివరించి.. తీరా సెట్లోకి వెళ్లాక మరొక సీన్ షూట్‌కు ప్లాన్‌ చేశారట. దీంతో చిరంజీవి విపరీతమైన కోపంతో అతనిపై అరిచేశాడట. ఒక సీన్ షూట్ అని చెప్పి.. తీరా టైంకి వేళ్తే వేరే సీన్ చేయాలంటావా అని ప్రశ్నించారట. ఇక రేపు చేయబోయే సీన్ కు సంబంధించిన సమాచారం మొత్తాన్ని ముందే ఇవ్వాలని దర్శకుడు కి వివరించారట. దానికి కారణం ముందు రోజే సీన్లు చెప్తే అక్కడ నటించే యాక్టర్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓ క్లారిటీ ఉంటుందని ఉద్దేశంతోనే చిరంజీవి అలా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం వశిష్టకు ఇది ఓ పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చిరంజీవి లాంటి స్టార్ హీరోని హ్యండిల్‌ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది ఆయనతో సినిమా చేసి హిట్ కొడితే.. ఆయ‌న మార్కెట్ మరింతగా పెరుగుతుంది. అలాగే ఆయనకు మరికొంతమంది స్టార్ హీరోస్ ఆఫర్లు ఇస్తారనడంతో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ డైరెక్టర్ మార్కెట్ బాగా పడిపోతుంది. అందుకే తనను తాను ప్రూవ్ చేసుకోవాలని వశిష్ట కూడా అహర్నిశలు శ్రమిస్తున్నాడట. చిరు కూడా బోళా శంకర్ సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. దీంతో వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా సక్సెస్ ఇద్దరికీ చాలా కీలకం కానుంది. ఇక ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. వశిష్ట సినిమాను అంచనాలకు అనుగుణంగా తెరకెక్కించాడా..? లేదా..? అనేది రిలీజ్ అయిన తర్వాత చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here