Venuswamy : త్వరలో ఆమె కారణంగా డివోర్స్ తీసుకోబోతున్న వరుణ్, లావణ్య.. షాకింగ్ న్యూ్స్ చెప్పిన వేణుస్వామి

- Advertisement -

Venuswamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి పరిచయం అక్కర్లేదు. సినిమా రంగంలోని ప్రముఖుల గురించిన జీవితాలు, వారి జాతకాలను బయటపెడుతూ సంచలనం రేపుతున్నాడు. సినీ ప్రముఖుల జీవితాలు, కెరీర్ ఎలా ఉంటాయనే విషయాన్ని వెల్లడిస్తుండటంతో ఆయనకు భారీ పాపులారిటీ పెరిగిపోయింది. ముఖ్యంగా ఆయన హీరో, హీరోయిన్ల వైవాహిక సమస్యలు, విడాకుల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. సెలబ్రెటీలపై, రాజకీయ నాయకులపై జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఫుల్ టార్గెట్ చేశారు వేణుస్వామి. దీంతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నాడు.

varun lav
varun lav

అంతే కాకుండా టాలీవుడ్‌లో పెళ్లైన కొందరు సెలబ్రెటీ జంటలు విడిపోతాయని వివాదాస్పద కామెంట్స్ చేశారు. గతంలో ఆయన చెప్పినట్లే నాగచైతన్య, సమంత విషయంలో జరిగింది. ఇప్పుడు ఈయన నేరుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. ఈ మేరకు కొత్తగా పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న.. లావణ్య, వరుణ్ తేజ్ విడిపోతారంటూ బిగ్ బాంబ్ పేల్చాడు. ‘మిస్టర్’ సినిమా సమయంలో ప్రేమలో పడిన వరుణ్ తేజ్, లావణ్య దాదాపు ఆరేళ్లు ప్రేమించుకుని.. గతేడాది నవంబర్‌‌లో పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. సినిమాలతో బిజీగా ఉన్నారు.

- Advertisement -

అయితే.. వీరు జాతకంలో కలిసి ఉండే యోగం లేదని వేణుస్వామి జ్యోష్యం చెప్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల జాతకం ప్రకారం వారికి పెళ్లి యోగం లేదు. కానీ పెళ్లి చేసుకున్నారు అంటే అది పెద్ద మిరాకిల్. ఎందుకంటే వాళ్లిద్దరి జాతకంలో గురుడు, శుక్రుడు నీచంగా ఉన్నాడు. వాళ్లు కలిసి ఉండే అవకాశం లేదు. నేను ఇలా చెబుతున్నానని.. నా మీద పడి ఏడుస్తూ విమర్శలు చేస్తారు. కానీ నేను జాతకం ప్రకారమే చెబుతాన్నాను. వ్యక్తిగతంగా తనకు వారితో గొడవ లేదు, బంధుత్వం లేదు. వీరిద్దరి ఫ్యామిలీలో ప్రముఖమైన ఓ లేడీ కారణంగా ఈ ఇద్దరూ విడిపోతారు. ఇది కానీ కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ జరుగుతుంది’ అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. దాదాపు మూడు నెలల క్రితం వేణుస్వామి ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఈ విషయాలు ప్రస్తు్తం వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here