ప్రతీ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సంబరాలతో పండుగ వాతారవరణం ని తలపిస్తాది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి అంచలంచలుగా ఎదుగుతూ కోట్లాది మంది అభిమానులకు ఆదర్శం అవ్వడం అనేది అభిమానులు ఎంత గర్వంగా భావిస్తుంటారు.

ఈ వయస్సులో కూడా ఆయన నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చెయ్యడమే కాకుండా, వాళ్ళకంటే ఎక్కువ రికార్డ్స్ పెట్టడం వంటివి చూస్తూ ఉంటే ఇండస్ట్రీ కి చివరి నెంబర్ 1 హీరో ఆయనే అని మరోసారి రుజువు అయ్యేలా చేసింది. ఇది ఇలా ఉండగా చిరంజీవి ప్రతీ ఏడాది తన పుట్టినరోజు ని ఎంతో ఘనంగా జరుపుకునే వాడు. తన నివాసం లో కుటుంబ సభ్యులు మరియు సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకునేవాడు.

కానీ ఈ ఏడాది మాత్రం అలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షం లో జరుపుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా బయటకి రానివ్వలేదు. ఇలా చిరంజీవి ఘనంగా పుట్టినరోజు జరుపుకోకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి రీసెంట్ గా విడుదలైన ‘భోళా శంకర్’ చిత్రం దారుణమైన పరాజయం పాలవ్వడం, రెండు చిరంజీవి కి రీసెంట్ గానే మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకోవడం.

ఈ రెండు కారణాలే వల్లే చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నాడని తెలిసింది. ఇక కాసేపటి క్రితమే చిరంజీవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసాడు. ఈ ఫోటో లో రామ్ చరణ్ కూతుర్ని పట్టుకొని చిరంజీవి కెమెరా కి ఫోజు ఇవ్వగా అది వైరల్ గా మారింది. మరి మెగాస్టార్ మళ్ళీ ఎప్పుడు బలమైన కం బ్యాక్ తో ఎంట్రీ ఇస్తాడో చూడాలి.