Chiranjeevi : ఓటీటీ అందుబాటులోకి వచ్చాక టాక్ షోస్ ఎక్కువ అయ్యిపోయాయి..ఇప్పటికే ఆహా మీడియా లో బాలయ్య బాబు ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో గ్రాండ్ హిట్ అయ్యింది.ఇప్పుడు లేటెస్ట్ గా సోనీ లివ్ వాళ్ళు ప్రముఖ పాప్ సింగర్ స్మిత తో ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షో ని ప్రారంభించారు.ఈ టాక్ షో కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈమధ్యనే సోనీ లివ్ ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అయ్యింది.మొదటి ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ ఎపిసోడ్ లో చిరంజీవి స్మిత తో కాసేపు చేసిన చిట్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ముందుగా తన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాధించిన విజయాల గురించి గర్వంగా చెప్పుకున్నాడు..ఆ తర్వాత తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.
స్మిత పవన్ కళ్యాణ్ గురించి అడుగుతూ ‘పవన్ కళ్యాణ్ ని మీరు సినీ హీరో గా ఎక్కువ ఇష్టపడుతారా, లేదా పొలిటీషియన్ గా ఎక్కువ ఇష్టపడుతారా’ అని అడిగిన ప్రశ్నకి చిరంజీవి సమాధానం చెప్తూ ‘పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగా సమాజం పట్ల ఎంతో బాధ్యత గలిగిన మనిషి, అతని భావాలన్నీ తన మనసు నుండి స్వచంగా వస్తాయి..చాలా నిజాయితీ పరుడు నా తమ్ముడు.కాబట్టి వాడు నాకు పొలిటీషియన్ గానే ఎక్కువ ఇష్టం.
చిన్నప్పటి నుండి వాడు ఏమవుతాడో అని భయపడేవాడిని, చిన్నతనం లో నేను సింగపూర్ కి షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు నీకోసం ఏమి తీసుకొని రావాలి రా అని అడిగితె అన్నయ్య అక్కడ డూప్లికేట్ గన్స్ ఉంటాయి, అవి తీసుకొస్తాడా అనేటోడు..వాడికి గన్స్ అంటే అంత పిచ్చి. వాడికి గన్స్ మీద ఉన్న మక్కువని చూసి నేను ఎక్కడ నక్సలైట్ అవుతాడేమో అని భయపడ్డాను.. ఒకరోజు రైల్వే స్టేషన్ చెకప్ లో కళ్యాణ్ దగ్గర గన్ ఉందని పోలీసులు ఆపేసారు.
ఆ తర్వాత అది డూప్లికేట్ గన్ అని తెల్సిన తర్వాత వదిలేసారు.. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న రేర్ లక్షణాలే ఈరోజు వాడిని ఇంతటి స్థాయిలో నిలబెట్టింది. వాడికి ఫ్యాన్స్ లేరు, భక్తులే ఉన్నారు’ అంటూ చిరంజీవి పవన్ గురించి ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సొసైల్ మీడియా లో వైరల్ గా మారాయి.