Chinna Movie : కొన్ని విలువైన సినిమా కొంతమంది హీరోలు చేస్తేనే సరైన ఫలితాలు వస్తాయి. అలా మన టాలీవుడ్ లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కొంతమంది అలాంటి గొప్ప సినిమాలు చేసిరి , ఆడియన్స్ కి సరిగా రీచ్ కాలేకపోయినవి ఉన్నాయి. రీసెంట్ గా సిద్దార్థ్ హీరో గా నటించిన ‘చిన్నా’ చిత్రం అలాంటిదే. ఈ సినిమా ముందుగా తమిళం,మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

రీసెంట్ గానే తెలుగు లో విడుదలై ఇక్కడ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. కానీ మన తెలుగు లో సిద్దార్థ్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోవడం వల్ల థియేటర్స్ దొరకలేదు. కలెక్షన్స్ కూడా అంతంత మాత్రం గానే ఉంది. మొదటి మూడు రోజులకు కలిపి కనీసం కోటి రూపాయిల గ్రాస్ అయినా వస్తుందా అంటే అనుమానమే. భవిష్యత్తులో ఎంత రేంజ్ కి వెళ్తుందో తెలియదు.

ఈ సినిమాలో సిద్దార్థ్ హీరో గా నటిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించాడట. అయితే ఈ చిత్రాన్ని తెలుగు లో మాత్రం దబ్ చెయ్యాలని అనుకోలేదట. న్యాచురల్ స్టార్ నాని ని హీరో గా పెట్టి, తన నిర్మాణ సంస్థ లో ఈ సినిమాని చెయ్యాలని అనుకున్నాడట. కానీ నాని అప్పుడే ‘దసరా’ అనే పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న చిత్రం చేస్తే ఆడియన్స్ ఒప్పుకుంటారో లేదో, ఫలితం తారుమారు అవ్వొచ్చు.

జెర్సీ సినిమాకి ఇలాగే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ, కమర్షియల్ గా ఆ సినిమా యావరేజి గా నిల్చింది అని నాని సిద్దార్థ్ కి చెప్పాడట. దీంతో ఆయన తెలుగు లో కూడా దబ్ వెర్షన్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమా నాని చేసి ఉంటే, ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో కచ్చితంగా పెద్ద హిట్ అయ్యేది, వంద కోట్లు కొల్లగొట్టేది అని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు.