Kushi Re – Release : అక్టోబర్ 11 న మరోసారి పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ రీ రిలీజ్.. మళ్ళీ రికార్డ్స్ బ్రేక్ కానున్నాయా?

- Advertisement -

Kushi Re – Release : ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రిలీజ్ ట్రెండ్ లో ఇండస్ట్రీ హిట్ లాంటి సినిమా ఖుషి. ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఏ సినిమా కూడా బ్రేక్ చెయ్యలేకపోయింది. దాదాపుగా అందరి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ ఒక్క సినిమా కూడా ఈ చిత్రానికి దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది.

Kushi Re - Release
Kushi Re – Release

మొదటిరోజు నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో దాదాపుగా 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి బరిలోకి దిగిన సింహాద్రి, బిజినెస్ మెన్ మరియు గుడుంబా శంకర్ చిత్రాలు ఖుషి రికార్డు ని బ్రేక్ చెయ్యడం లో విఫలం అయ్యాయి.

Pawan Kalyan

ఇప్పుడు ఆ ఖుషి రికార్డు ని బ్రేక్ చెయ్యడానికి మళ్ళీ ఖుషి చిత్రం విడుదల అవ్వబోతుంది. అక్టోబర్ 11 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పాతికేళ్ళు అవుతుంది. ప్రతీ ఏడాది అక్టోబర్ 11 వ తేదీని ‘వరల్డ్ పవనిజం డే’ అని పిలుస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా ఖుషి చిత్రం ని మరోసారి రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ముందుగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే సంధ్య 70 ఎంఎం థియేటర్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించనున్నారు.

- Advertisement -
Pawan Kalyan Kushi Movie

ఆ తర్వాత వరుసగా షోస్ యాడ్ చేసుకుంటూ పోతారట. కాకపోతే ఇది లిమిటెడ్ రిలీజా, లేదా భారీ రిలీజా అనేది తెలియాల్సి ఉంది. లిమిటెడ్ రిలీజ్ అయితే ఖుషి గత సంవత్సర రికార్డు ని కొట్టడం కష్టమే, అదే భారీ రిలీజ్ అయితే కచ్చితంగా మార్జిన్ తో కొడుతుందని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here