500 జీతం కోసం మల్టిప్లెక్స్ లో పనిచేసిన ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

క్రింద కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. కేవలం అందాన్ని నమ్ముకోకుండా తన టాలెంట్ ని నమ్ముకొని ఇండస్ట్రీ లో పైకి వచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు.ప్రస్తుతం అందాలు ఆరోబోస్తున్న హీరోయిన్స్ కొంతకాలం నెగ్గుకురాగలరేమో కానీ, ఇలాంటి టాలెంట్ ఉన్న హీరోయిన్స్ డిమాండ్ మాత్రం ఎప్పటికీ తగ్గిపోదు. ఇంతకీ క్రింద కనిపిస్తున్న ఫోటో ఉన్న ఆ చిన్నారి మరెవరో కాదు ఐశ్వర్య రాజేష్.

ఐశ్వర్య రాజేష్
ఐశ్వర్య రాజేష్

‘నీతన అవన్’ అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాజేష్, చెన్నై లో పుట్టి పెరిగిన ఒక తెలుగు కుటుంబానికి చెందిన అచ్చ తెలుగు అమ్మాయి.ఈమె తెలుగు ఎంత అనర్గళంగా మాట్లాడగలదో , తమిళం కూడా అంతే స్పష్టంగా మాట్లాగలుగుతుంది. ఐశ్వర్య రాజేష్ అచ్చ తెలుగు అమ్మాయి అయ్యినప్పటికీ చిన్నప్పటి నుండి పుట్టి పెరిగింది చెన్నై లోనే కాబట్టి, ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది.

2010 నుండి ఇప్పటి వరకు ఐశ్వర్య రాజేష్ అక్షరాలా 60 సినిమాల్లో హీరోయిన్ గా నటించేసింది.ఇంత తక్కువ సమయం లో ఇన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ మరొకరు లేరు. ఆ ఘనత కేవలం ఐశ్వర్య రాజేష్ కి మాత్రమే దక్కింది.ప్రస్తుతం ఆమె చేతిలో మూడు మలయాళం సినిమాలు మరియు మూడు తమిళ సినిమాలు ఉన్నాయి.తెలుగు లో ఇప్పటి వరకు ఈమె ‘కౌసల్య కృష్ణ మూర్తి’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ మరియు మిస్ మ్యాచ్ వంటి సినిమాల్లో నటించింది.

- Advertisement -

చిన్నతనం లోనే తండ్రిని కోల్పోయిన ఐశ్వర్య రాజేష్,కస్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి ఎదో విధంగా సహాయ పడాలి అనే తపన తో పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే వీకెండ్స్ లో మాల్స్ కి వెళ్లి 500 మరియు వెయ్యి రూపాయిల కోసం కూడా పని చేసిన రోజుల నుండి, నేడు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకునే రోజుల వరకు ఆమె ఎదిగిన తీరు ప్రతీ ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయం అని చెప్పొచ్చు. అయితే ఐశ్వర్య రాజేష్ చిన్ననాటి ఫోటో తన తండ్రి కలిసి ఉన్నది సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది. ఆ ఫోటోని మీరు కూడా చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here