Anjali : అలాంటి నిర్ణయాలతో రోజు రోజుకు దిగజాయిపోతున్న అంజలి

- Advertisement -


Anjali : టాలీవుడ్ యంగ్ బ్యూటీ అంజలి ‘ఫోటో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. 2014లో వచ్చిన కామెడీ, హారర్ సినిమా ‘గీతాంజలి’కి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా అందం కోసం పొట్ట మాడ్చుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలా సర్జరీలు చేయించుకుని ప్రాణాంతక డైట్స్ పాటిస్తూ చాలా మంది హీరోయిన్లు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్న ఘటనలున్నాయి. అయితే తాజాగా హీరోయిన్ అంజలి కూడా అదే నిర్ణయం తీసుకుందని ఓ వార్త వైరల్‌గా మారింది.

హీరోయిన్ అంజలి ఒకప్పుడు బొద్దుగా ఉండేది. ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారిపోయింది. అయితే ఆమె ఇంత స్లిమ్ గా మారడానికి కారణం ఆమె అనుసరిస్తున్న స్ట్రిక్ట్ డైట్. కడుపు నిండా అన్నం తినకుండా మాడ్చుకుంటుందట. ఆహార నియంత్రణను అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చు. బరువు తగ్గడానికి.. కోల్పోయిన బరువును మెయింటెయిన్ చేయడానికి చాలా తిప్పలు పడాలి. ఈ క్రమంలో ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేసింది అంజలి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంజలి నిర్ణయంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం ముఖ్యం కానీ ముందు ఆరోగ్యం ముఖ్యం కాదంటున్నారు. ప్రజెంట్ హీరోయిన్ అంజలి గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ – కియారా కూడా నటిస్తున్నారు..!!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here