Charmme Kaur : టాలీవుడ్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో ఛార్మి కచ్చితంగా ఉంటుంది. ‘నీ తోడు కావాలి’ అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఛార్మి ఆ సినిమా తర్వాత పెద్దగా పేరు తెచ్చుకునే చిత్రాలలో ఏమి నటించలేదు కానీ, ఆమె హీరోయిన్ గా నటించిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

అదే సినిమాతో ఆమె అప్పట్లో తీవ్రమైన విమర్శలు కూడా ఎదురుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఛార్మి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒకానొక దశలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చిన ఛార్మి ‘జ్యోతి లక్ష్మి’ సినిమా తో నటనకి గుడ్ బై చెప్పి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మించడం ప్రారంభించింది.

పూరి జగన్నాథ్ తో ప్రయాణం మొదలుపెట్టిన ముహూర్తం బాగలేదేమో తెలీదు కానీ, ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రం తప్ప, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. అంతే కాకుండా వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని, ఛార్మి కారణంగా పూరి జగన్నాథ్ తన భార్య శ్రావణి కూడా దూరం అయిపోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే ఛార్మి రీసెంట్ గా తన కొడుకు ని తల్చుకొని ఏడుస్తూ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది. ఇంకా పెళ్లి కానీ అమ్మాయికి కొడుకు ఎక్కడ నుండి వచ్చాడు అని అనుకుంటున్నారా..ఆ పాయింట్ కే వస్తున్నాం. ఛార్మి కి ఎంతో ఇష్టమైన పెంపుడు తెల్ల బొచ్చు కుక్క ఉంది. దీంతో ఛార్మికి ఎంతో మంచి అటాచ్మెంట్ ఉంది.

సొంత కొడుకులాగా భావించేది. రెండేళ్ల క్రితం ఆ తెల్ల బొచ్చు కుక్క చనిపోయింది అట. దాంతో తనకి ఉన్న అనుబంధం ని గుర్తు చేసుకుంటూ ‘నువ్వు దూరమై రెండేళ్లు అవుతుంది.. నీ కౌగిలి ని, నీ ముద్దులను బాగా మిస్ అవుతున్నాను. నువ్వు ఎప్పటికీ నాకు ఎంతో ఇష్టమైన మొట్టమొదటి మగబిడ్డవే. మళ్ళీ తిరిగి నా దగ్గరకి వచ్చేయవా, నువ్వు లేని నా జీవితం అసంపూర్ణం’ అంటూ ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టింది.