Charmi Poori : డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మి నడుమ ఏదో నడుస్తోంది అంటూ.. ఓ రేంజ్ లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి మనకి తెలిసిందే.. కాగా వీళ్ళిద్దరూ మధ్యన ఏమీ లేదంటూ ఎంచక్కా ఇద్దరు కలిసి షికారులు చేస్తూనే ఉన్నారు. తాజాగా పూరి జగన్నాథ్ , చార్మి ఇద్దరు ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు.. దాంతో ఈ వార్త మరోసారి తెరపైకి వచ్చింది..

పూరి జగన్నాథ్ చార్మి ఇద్దరు ముంబై ఎయిర్పోర్టు లో బోర్డింగ్ పాస్ తీసుకుంటా ఉండగా మీడియా కంటపడ్డారు. మేడం సర్ ఒకసారి చూడండి అంటూ మీడియా వాళ్ళు వాళ్ళని పిలవడంతో పూరి జగన్నాథ్, చార్మి ఇద్దరు ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. ఇక చార్మి వాళ్ళని ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న కూడా వేసింది. ఇక్కడ సౌత్ ఇండియన్ సాంగ్ కి డాన్స్ వేసింది మీరే కదా అంటూ వారిని అడిగింది.. అవును అని వారు చెప్పగానే.. నేను వచ్చేటప్పుడు విన్నాను అంటూ వారితో కబుర్లు కూడా చెప్పింది చార్మి..
అయితే పూరి జగన్నాథ్ చార్మి ఇద్దరు ఒకే చోట కనిపించేసరికి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంటూ .. వీళ్ళు రిలేషన్ లో ఉన్నారంటూ.. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో రాసుకోస్తున్నారు. ఛార్మితో పూరి జగన్నాథ్ సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్నారని వార్తలు గతంలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. కానీ వీళ్ళిద్దరూ వాటి గురించి పట్టించుకోలేదు. మధ్యన మాత్రం పూరి జగన్నాథ్ ఈ విషయంపై స్పందించారు.
తనకి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఛార్మి తెలుసని.. ఆమెతో ఉన్న సాన్నిహిత్యం పై స్పందించారు. దశాబ్దాలుగా తనతో కలిసి పనిచేస్తున్నానని.. మా ఇద్దరి మధ్య స్నేహబంధం మాత్రమే ఉందని తెలిపారు. ప్రేమ లేదా ఎఫైర్ ఉండుంటే అది ఎక్కువ రోజులు నిలవదని.. మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది కాబట్టి ఇన్నాళ్లుగా మేము ట్రావెల్ చేయగలుగుతున్నామని చెప్పారు. స్నేహమే శాశ్వతంగా నిలుస్తుందని.. ఆ స్నేహంతోనే మేము ఎన్నాళ్ళు కలిసి ఉండగలిగాం అని పూరి జగన్నాథ్ అన్నారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి తీసిన లైగర్ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్ లో కనిపించేసరికి పూరి జగన్నాథ్ చార్మి డేటింగ్ లో ఉన్నారనే వార్త మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.