Chandini Chowdary : టాలీవుడ్ యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ క్యూటీ. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. తర్వాత సినిమాల్లోకి వచ్చి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. అదేంటంటే.. సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి చాందిని చౌదరికి ఫోన్ చేసి నువ్వు ఇప్పుడే నా గెస్ట్ హౌస్ కి రావాలని, లేదంటే నీ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

ఏం చేయాలో తెలియక తొలుత టెన్షన్‌తో ఏడ్చింది. తర్వాత వారి గురించి తెలుసుకొని మరి వెళ్లి చెంప చెల్లుమనిపించిందట. ఇంతకీ ఈ స్టోరీ ఏంటి అంటే.. అసలు చాందిని చౌదరిని గెస్ట్ హౌస్‌కు రమ్మన్న ఆ వ్యక్తి ఎవరో ఒకసారి చూద్దాం. ఇటీవలే చాందిని గామి సినిమాలో నటించి సూపర్ సక్సెస్ అందుకుంది. తనకు సరిపోయే పాత్రలను మాత్రమే ఎంచుకుని అలాంటి సినిమాల్లోనే నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే గతంలో ఈ బ్యూటీ కి ఓ కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చిందట.
రేపు గెస్ట్ హౌస్ కు రాకపోతే.. మీ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారని అన్నారట.. ఆ మెసేజ్ చూసిన చాందినీకి ఏం చేయాలో తోచలేదని.. ఆ విషయం తెలిసిందే. ఆమె ఏడుపు చూసిన టాలీవుడ్ నటి.. టామ్‌బాయ్ స్నిగ్ధ వెంటనే స్పందించింది. నీపై ప్రాంక్ చేసింది నేనే.. జస్ట్ ఆట పట్టించడానికి అలా చేశానని ఆమె చెప్పిందట. చాందినీ చౌదరి ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు అని అడిగిందట. తను ఉన్న ప్లేస్ కు వెళ్లి చెంప చెల్లుమనిపించిందట చాందిని. అయితే ఇదంతా చాలా కాలం క్రితమే జరిగిందట. తాజాగా దావత్ షోలలో సందడి చేసిన నటి స్నిగ్ధ ఈ విషయాన్ని చెప్పింది.