Ruhani Sharma : టాలీవుడ్ బ్యూటీ రుహానీ శర్మ సోషల్ మీడియాలో తన ఫొటోలతో హల్ చల్ చేస్తోంది. ఈ భామ తాజాగా వయోలెట్ కలర్ శారీలో కనిపించింది. ఈ ఫొటోలతో క్యూట్ క్యూట్‌గా పోజులిస్తూ నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో రుహానీ చేతికి పర్పుల్ కలర్ గాజులతో, చెవికి జుంకాలతో అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. లూస్ హెయిర్‌తో క్యూట్ స్మైల్‌తో మెస్మరైజ్ చేస్తోంది. రుహానీ అందాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాట్ ఏ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

చీరకట్టులో రుహానీ అందానికి అభిమానులు, కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. సో బ్యూటిఫుల్, సో గార్జియస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొన్నటిదాకా వెస్టర్న్ డ్రెస్సులో ఘాటు పోజులతో చెమటలు పట్టించిన రుహానీ ఇప్పుడు ట్రెడిషనల్ డ్రెస్సులో గుండెకు గాయం చేస్తోందంటూ కవితలు రాసేస్తున్నారు. ఈ భామ అందం తింటోందా అన్నం తింటోందా అంటూ కొంటె కామెంట్లతో కామెంట్ సెషన్ మొత్తం నింపేస్తున్నారు. ఇంకొందరు హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమనంతా రుహానీపై కురిపించేస్తున్నారు.
ఇక రుహానీ శర్మ సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ ఈ ఏడాది సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలతో ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించాయి. ఇక ఈ భామ లేటెస్ట్గా సుహాస్ హీరోగా ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీరంగ నీతులు సినిమాలో నటిస్తోంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నా ఈ బ్యూటీ తన పర్సనల్ స్పేస్‌ను మాత్రం ఎప్పుడూ మిస్ అవ్వదు. అందుకే గ్యాప్ దొరితే వెకేషన్లకు చెక్కేస్తూ ఉంటుంది.