డి కొరియోగ్రాఫర్ గా సుపరిచితమైన చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ భాధకు గురిచేస్తోంది ఎప్పుడు తను సంతోషంగా ఉంటూ పక్క వాళ్ళని నవ్వించే చైతన్య మాస్టర్ ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక కారణాలవల్లే చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు అంటున్నారు తాజాగా చైతన్య ఆఖరిగా మాట్లాడిన తన చాట్, కాల్ రికార్డింగ్ మీడియాకు అందింది.

చైతన్య మాస్టర్ తన స్నేహితుడైన పవన్ తో చాట్ చేశారు. అందులో డబ్బుల అంశమై వాళ్ళతో నీకు మధ్యాహ్నం వేయిస్తాను. ఓకేనా అని అడుగుతారు. రెండు నుంచి నాలుగు గంటల లోపు డబ్బులు సెండ్ చేస్తాను. నువ్వు అడ్జస్ట్ చేస్తున్నావని అవతల వాళ్ళకి చెప్పు అని చైతన్య మాస్టర్ తన స్నేహితుడైన పవన్ తో అంటాడు.

వాళ్లకి మెసేజ్ చేసావా వాళ్లు ఏమన్నారు అని మళ్లీ చైతన్య మాస్టర్ మెసేజ్ చేశారు. లేదు అని అనగానే, నువ్వు వాళ్లకి మెసేజ్ చేసి వాళ్ళు ఏమన్నారో మళ్ళీ నాకు చెప్పమని చైతన్య పవన్ కి మెసేజ్ చేశారు. ఆ తరవాత ఒక వాయిస్ నోట్ కూడా ఉంది. అందులో కూడా ఆర్థిక విషయాలకి సంబందిచినవి మాట్లాడారు. కానీ, చైతన్య మాస్టర్ డబ్బులు కోసం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అని, ఆయన అడిగితే ఎంతోమంది డబ్బులు ఇస్తారని ఆయన స్నేహితులు సన్నిహితులు అంటున్నారు. మరికొన్ని రోజుల్లోనే పోలీసు విచారణ జరిగిన తరువాత అసలు నిజానిజాలు బయటకు వస్తాయి.