ప్రస్తుతం టాలీవుడ్ క్రష్ శ్రీలీల అనడంలో సందేహమే లేదు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతటి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామ తెలుగులో ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.. అది ఎంతలా అంటే కుర్ర హీరోల నుండి స్టార్ హీరోల వరకు తనే కావాలనేంత. అందం, అభినయం, అభినయం, ఎనర్జిటిక్ డాన్సులతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం తన చేతిలో అర డజన్ కు పైగా ప్రాజెక్టులున్నాయి.

మహేశ్ సరసన చేస్తున్న శ్రీలీల సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో శ్రీలీలని మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే మొదట సెంకడ్ హీరోయిన్ పాత్రకు శ్రీలీలతో రూ. 70 లక్షలకు మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు మెయిన్ హీరోయిన్ శ్రీలీలే అయింది. కానీ పారితోషికం మాత్రం పెంచలేదు. శ్రీలీల కూడా తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడకుండా తెలివిగా ప్రవర్తించింది. కారణం సూపర్ స్టార్ సరసన అవకాశం రావడమే గొప్ప అలాంటిది తన సినిమాలో మెయిన్ లీడ్ కావడం తన కెరీర్ కు చాలా ప్లస్ అవుతుందని అమ్మడి ప్లాన్. ఈ సినిమా తర్వాత శ్రీలీల క్రేజ్ మూడు రెట్లు పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో డబ్బును పట్టించుకోకుండా మహేష్‌తో ఆడి పాడాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు శ్రీలీల తెలివికి ముక్కున వేలేసుకుంటున్నారు.