Anchor Rashmi : బుల్లితెరపై క్రేజీ కపుల్ జంటగా సుధీర్- రష్మీ జంటని చెప్పవచ్చు. వారిద్దరు కలిసి కనిపిస్తే ప్రేక్షకుల రెస్పాన్స్ మాములుగా ఉండదు. సుధీర్ హీరోగా మారాక బుల్లితెరపై కనిపించడం మానేశాడు. ఈ క్రమంలో రష్మి-సుధీర్ జంటగా కనిపించడం లేదు. అయితే వారిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని ఎప్పటి నుండో జోరుగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాటిని ఇద్దరు ఖండిస్తూ వస్తున్నారు. తామిద్దరం కేవలం స్నేహితులమని చెప్పుకొస్తున్నారు.
అయితే వారెన్ని చెప్పిన సుధీర్- రష్మీల పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది. రష్మి గౌతమ్.. నాలుగు పదులకి దగ్గరగా ఉండగా, ఈ మధ్య ఆమె పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేసింది. తనకు పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో బుల్లెట్ భాస్కర్ స్పందించాడు. అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల ప్రసారమైన జబర్దస్త్ షోలో భాస్కర్ స్కిట్ వేశాడు. ఇందులో రాజుగా కనిపించిన ఆయన రష్మి దగ్గరకు వెళ్లి.. మన బాబు బాగానే జీతాలు ఇస్తున్నట్టున్నాడు ప్రతి వీడియోకు వచ్చే కామెంట్లు చూస్తుంటేనే అర్థం అవుతుంది అని అంటాడు. అంతా విన్న రష్మి పక్కున నవ్వుతుంది. ఆ తర్వాత భాస్కర్ వాడెవడో బుల్లెట్ భాస్కర్ గాడికి గ్రౌండ్ ఫ్లోర్ బలిసింది అన్నాడు భయపడటానికి ఘోట్ కాదు లయన్ అని చెబుతాడు.
ఇక స్టేజీ పైకి వెళ్లిన భాస్కర్‌ను అసిస్టెంట్ సుధీర్ – రష్మికి పెళ్లి అవుతుందా? అని అడుగుతాడు. దీంతో నిన్నే జాతకాలు చూపించాను. వారిద్దరికీ పెళ్లి జరుగుతుంది కానీ రష్మికి అమెరికా అబ్బాయితో.. సుధీర్‌కు అమలాపురం అమ్మాయితో వివాహం అవుతుంది అంటాడు. అయితే అదంతా స్కిట్ అయినప్పటికీ ప్రస్తుతం భాస్కర్ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలిసిన వారంతా నిజంగానే చేసుకుంటుందేమో అందుకే భాస్కర్ హింట్ ఇచ్చాడని అంటున్నారు.