పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదలై నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ లో ఎక్కువ శాతం ల్యాగ్ ఉండడం వల్లే ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చిందని అంటున్నారు అభిమానులు. అంతే కాకుండా ఇది పవన్ కళ్యాణ్ సినిమాలాగే అసలు అనిపించలేదని , సాయి ధరమ్ తేజ్ సినిమాలాగానే అనిపించింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా వినిపించాయి.
కానీ పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ కారణంగా ఈ చిత్రం మొదటి వీకెండ్ దుమ్ము లేపే వసూళ్లను రాబట్టింది. ఆ వసూళ్లను చూసి అసలు సినిమా హిట్టా, ఫ్లాపా? అనే సందేహం కలిగింది. ఆ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని కుమ్మాడు పవన్ కళ్యాణ్. ఇక వర్కింగ్ డేస్ లో సోమవారం రోజు భారీ స్థాయిలో డ్రాప్స్ కనిపించినప్పటికీ , స్టడీ గా సోమవారం వచ్చిన రోజు వసూళ్లే దాదాపుగా నాలుగు రోజుల పాటు వచ్చాయి.
అలా మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో మరో పది కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే ఈ సినిమా టాక్ బాగాలేకపోయినా కూడా కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో అద్భుతమైన గ్రాస్ ని రాబట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్స్ షోస్ లో ఈ సినిమా డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి వారం లో కేవలం హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్స్ షోస్ నుండి 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది దాదాపుగా ఒక సూపర్ హిట్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తో సమానం అని అంటున్నారు. ఒకవేళ హిట్ టాక్ వచ్చి ఉంటే కచ్చితంగా ఈ చిత్రం ఇప్పుడు వచ్చిన దానికంటే రెండు రెట్లు ఎక్కువ రాబట్టి ఉండేదని అంటున్నారు.