పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గట్టు సినిమా లేకపోవడమే ఈ నెగటివ్ టాక్ రావాక్డానికి కారణం. కానీ పవన్ కళ్యాణ్ స్టామినా వల్ల ఈ చిత్రానికి వీకెండ్ సెన్సషనల్ ఓపెనింగ్స్ దక్కాయి. చాలా ప్రాంతాలలో అడ్వాన్స్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు రికవర్ అయిపోయారు.

ఆ ప్రాంతాలలో మొదటి వారం తర్వాత నుండే లాభాలు రావడం మొదలయ్యాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో నాల్గవ రోజు నుండి భారీ స్థాయిలో వసూళ్లు తగ్గిపోయినప్పటికీ, సోమవారం వచ్చిన వసూళ్లే అటు ఇటు గా మిగిలిన నాలుగు రోజులు రావడం తో బయ్యర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక రెండవ వీకెండ్ లో ప్రతీ చోట హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ పది రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

ఈ చిత్రానికి పదవ రోజు దాదాపుగా 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అని అంటున్నారు. భీమ్లానాయక్ పదవ రోజు రాబట్టిన వసూళ్లకంటే ఎక్కువే రాబట్టింది ఈ బ్రో చిత్రం . ముఖ్యంగా నైజాం , వైజాగ్ మరియు రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని కేంద్రాలలో రోజు రాబట్టే గ్రాస్ వసూళ్లను కేవలం ఒక్క షో ద్వారానే రాబట్టింది. ఇలాంటి సెంటర్స్ చాలా ఉన్నాయి. నిన్నటితో నైజాం ప్రాంతం లో ఈ చిత్రం 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ ప్రాంతం లో 25 కోట్ల రూపాయలకు జరిగాయి.
అసలు సినిమా రన్ ఉంటుందో లేదో, కచ్చితంగా భారీ నష్టాలు వస్తాయి అనుకున్న బయ్యర్స్ కి ఇంకా బ్రేక్ ఈవెన్ మీద ఆశలు కలిగించేలా చేసింది అంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక, ఓవర్సీస్ , ఈస్ట్ , వెస్ట్ మరియు కృష్ణ జిల్లాలలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాలను అర్జిస్తుంది. ఇప్పటి వరకు 68 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 75 కోట్ల రూపాయలకు పైగా రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
