Bro First Review : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మేనియా నే కనిపిస్తుంది. ఒక పక్క ‘వారాహి విజయ యాత్ర’ తో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ , ఇప్పుడు ‘బ్రో ది అవతార్’ చిత్రం తో మన ముందుకు మరో 8 రోజుల్లో రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో మూవీ యూనిట్ మొత్తం ఫుల్ బిజీ గా ఉంది. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి క్లీన్ U సర్టిఫికెట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషన్స్ రెండు కూడా సమపాళ్లలో ఉన్న సినిమా మన టాలీవుడ్ లోకి రాబోతుందని, పవన్కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సిఇనిమ ఒక కనుల పండుగే అని చెప్తున్నారు. మనిషి జీవితం లో భవిష్యత్తు అనేదే ఉండదు. ఈ క్షణం ఎలా బ్రతికాము అనే దానిపైనే ఉంటుంది అనే కాన్సెప్ట్ మీదనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ సముద్ర ఖని.

చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చుతుందని, పవన్ కళ్యాణ్ సినిమాకి ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి ఎలా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారో ఈ సినిమా కి కూడా అదే రేంజ్ లో బ్రహ్మ రథం పడుతారని అంటున్నారు సెన్సార్ సభ్యులు. ముఖ్యంగా చివరి 30 నిముషాలు వచ్చే ఎమోషన్ కి ఎలాంటి వాడైన కనెక్ట్ అవుతారు అట. ఇందులో సాయి ధరమ్ తేజ్ కి చెల్లెలు గా ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది.

వీళ్లిద్దరి మధ్య చివర్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయని అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఇదే చెప్పాడు. నిన్న జరిగిన సెన్సార్ షో నుండి కూడా ఇదే టాక్. ఇక రేపు కానీ ఎల్లుండి కానీ ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారట. ఈ ట్రైలర్ ని థియేటర్స్ లో విడుదల చేసేందుకు పాన్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ట్రైలర్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది అనేది.