పెళ్లైన స్టార్ హీరోతో జాన్వీ కపూర్ బోల్డ్ రొమాన్స్.. తెగించేసిందంటూ నెటిజన్ల కామెంట్స్

- Advertisement -

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి- నిర్మాత బోనీ కపూర్​ల ముద్దుల తనయగా బాలీవుడ్​లోకి అరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. బ్యాక్​గ్రౌండ్​తో ఎంట్రీ ఇచ్చినా.. ఈ బ్యూటీ అనతికాలంలోనే సొంత గుర్తింపు తెచ్చుకుంది. మిగతా స్టార్ కిడ్స్​తో పోలిస్తే.. జాన్వీ కెరీర్ గ్రాఫ్ చాలా డిఫరెంట్​గా.. కాస్త బెటర్ సక్సెస్​ కనిపిస్తుంది. ఈ భామ డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ తనలోని నటిని మెగురు పరుచుకునే పనిలో పడింది. సినిమా సక్సెస్​.. ఫెయిల్యూర్​తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బీ టౌన్​లో సత్తా చాటుతోంది. మరోవైపు తనకు ఫేవరెట్ అయిన టాలీవుడ్​లోనూ ఎంట్రీకి సాలిడ్ ప్లాన్ చేసింది.

janhvi kapoor

అందులో భాగంగానే ఈ భామ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్​లో కూడా పాల్గొంది. మరోవైపు ఈ భామ బీ టౌన్​లోనూ ఐదారు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవలే బవాల్ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది.

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్​తో కలిసి జాన్వీ బవాల్ సినిమాలో రొమాన్స్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్​లో ఈ జంట కనులవిందుగా కనిపిస్తోందని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఫొటోషూట్స్ కూడా చేసింది ఈ జంట. అయితే తాజాగా చేసిన ఫొటోషూట్ మాత్రం బాలీవుడ్​లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ ఫొటోలు చూసిన టాలీవుడ్ యువత తెగ ఫీల్ అయిపోతోంది. దానికి కారణం ఈ ఫొటోషూట్​లో జాన్వీ వరుణ్​తో ఘాటుగా పోజులివ్వడమే. ప్రస్తుతం ఈ ఇద్దరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
varun Dhawan

సోషల్ మీడియాలో జాన్వీ చేసే రచ్చ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ ఇలా సినిమా ప్రమోషన్స్ పేరుతో ఘాటు పోజులివ్వడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అది కూడా ఓ పెళ్లైన హీరోతో ఏంటని ట్రోల్ చేస్తున్నారు. వరుణ్ ఒళ్లో కూర్చొని దిగిన ఫొటోలను జాన్వీ తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో బీ టౌన్​లో హీట్ పుట్టింది. ఇక బవాల్ సినిమా స్క్రీనింగ్​లోనూ జాన్వీ తనదైన స్టైల్​లో డ్రెస్సింగ్​తో అందరినీ ఆకర్షించింది. సినిమా జులై 21న రిలీజ్​ కానుంది. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here