Bootcut Balaraju : ఎంత ఏడ్చినా జాలి చూపని ప్రేక్షకులు.. ‘బూట్ కట్ బాలరాజు’ 2 రోజుల వసూళ్లు ఇవే!

- Advertisement -

Bootcut Balaraju : బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన వ్యక్తి సోహెల్. అంతకు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు, కొన్ని సినిమాల్లో సీరియల్స్ లో హీరో గా కూడా చేసాడు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడో అప్పటి నుండి ఆయన జాతకమే మారిపోయింది.

Bootcut Balaraju
Bootcut Balaraju

బిగ్ బాస్ సీజన్ 4 లో నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులను తీసుకొని మూడవ స్థానం లో బయటకి వచ్చిన సోహెల్, ఆ తర్వాత వరుసగా నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. రీసెంట్ గా ఆయన నటించిన నాల్గవ చిత్రం ‘బూట్ కట్ బాలరాజు’ విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు సోహెల్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Bigg Boss Sohel

సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది కానీ , కలెక్షన్స్ లేవు. దీంతో థియేటర్ ముందు మీడియా తో మాట్లాడుతూ సోహెల్ కంటతడి పెట్టుకున్నాడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోహెల్ సోహెల్ అని వేల కామెంట్స్ పెట్టారు కదా, ఏమైంది ఇప్పుడు?, వచ్చి నా సినిమా చూడండి అన్నా అంటూ బోరుమని విలపించాడు. సోహెల్ అలా ఏడవడం లో కూడా అర్థం ఉంది.

- Advertisement -
Bigg Boss Sohel Movies

ఎందుకంటే ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్నీ థియేటర్స్ కి కలిపి కనీసం 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా ఈ రెండు రోజులకు కలిపి రాలేదు. పాపం సోహెల్ ఈ సినిమాకి తాను దాచిపెట్టుకున్న డబ్బుతో పాటుగా తన తండ్రి రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులను కూడా వాడేసాడట. అంటే కాకుండా పలువురి దగ్గర భారీగా అప్పులు కూడా చేసాడట. మొత్తం 5 కోట్లు ఖర్చు అయ్యింది, మొత్తం పొయ్యినట్టే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here