అల్లు అర్జున్ పై కన్నేసిన బాలీవుడ్ పెద్దలు.. అందుకే ఇదంతా చేస్తున్నారా..!

- Advertisement -

ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాలపై బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తాజాగా స్పందించారు. అవార్డుల విషయంలో జ్యూరీ నిర్ణయం ఎప్పుడూ గొప్పగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రానికిగాను ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికైన టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ ను ఆయన ప్రశంసించారు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

ఆ చిత్రంలో అర్జున్‌ అద్భుతంగా నటించారని కొనియాడారు. జాతీయ మీడియాతో విక్కీ కౌశల్‌ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. నేషనల్‌ అవార్డ్స్‌పై స్పందించారు. తాను నటించిన ‘సర్దార్‌ ఉద్దమ్‌’ గురించి ప్రశ్న ఎదురవగా.. దర్శకుడు సూజిత్‌ సిర్కార్‌తో కలిసి పనిచేయడమే ఏదో సాధించినట్లు ఫీలయ్యానని, అలాంటిది ఆ సినిమాకి పలు విభాగాల్లో జాతీయ అవార్డులురావడం బోనస్‌ అని పేర్కొన్నారు. ఆ సినిమా ఎన్నో విషయాల్లో వ్యక్తిగతంగా తనకు చాలా ప్రత్యేకమన్నారు. హిట్‌, ఫ్లాప్‌.. ఇలా సినిమాల ఫలితం ఏదైనా తాను స్వీకరిస్తానని పేర్కొన్నారు. ఉత్తమ చిత్రంసహా ఐదు విభాగాల్లో ‘సర్దార్‌ ఉద్దమ్‌’ జాతీయ పురస్కారం దక్కించుకుంది.

‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’సినిమాలోని నటనకుగాను విక్కీని జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు. ఇదే సినిమాకిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌ నిలిచారు. ‘పుష్ప: ది రైజ్‌’ సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here