Pushpa 2 : మరో రాజమౌళిలా తయారవుతోన్న సుకుమార్.. ‘పుష్ప -2’ ఆ సమయానికి కష్టమేనా!

- Advertisement -

Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’ మొదటి భాగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్​లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్​ను షేక్ చేసింది. అల్లు అర్జున్​తో పాటు ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, అజయ్ ఘోష్.. పాత్రలన్నీ సినిమాలో హైలైట్​గా నిలిచాయి. ముఖ్యంగా నార్త్​ ఆడియెన్స్​ ఫిదా అయిపోయారు. అక్కడి బాక్సాఫీస్​ ముందు ఏకంగా రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

Pushpa 2
Pushpa 2

అల్లుఅర్జున్ ​కు పాన్​ ఇండియా స్టేటస్​ ను అందించింది.దీంతో తెలుగు ఆడియెన్స్ ​తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రియులు పుష్ప రెండో భాగం కోసం అప్పటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ రావట్లేదు. చాలా ఆలస్యంగా ఎప్పుడో ఒకటి వస్తోంది. ఆ మధ్యలో పుష్ప 2 గ్లింప్స్​.. సినిమాపై అంచనాలను మరింత స్థాయికి తీసుకెళ్లిపోయాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా మొదటి భాగాన్ని చాలా త్వరగానే ముగించారు. కానీ ఇప్పుడీ రెండో భాగంలో మాత్రం అలా అస్సలు అవ్వట్లేదు. కథ కోసం ఏడాదికి పైగా సమయాన్ని తీసుకున్నారు సుక్కు. ఈ చిత్రాన్ని ఎంతో శ్రద్ధగా తెరకెక్కిస్తున్నారు.

one year of pushpa
one year of pushpa

ఎక్కడా రాజీపడకుండా ప్రతి చిన్న సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా తీస్తున్నారట. దీంతో ఇప్పుడు రెండో భాగం ఈ ఏడాది కూడా వచ్చే అవకాశం లేదని తెలిసింది. మొన్నటివరకు ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో వస్తుందని అంతా అన్నారు. కానీ ఇప్పుడది వాయిదా పడ్డట్లు తెలిసింది. 2024లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని ఇన్​సైడ్​ టాక్ వినిపిస్తోంది. అది కూడా అంతా అనుకున్నట్లు జరిగితే.. 2024 వేసవి చివర్లో పుష్ప 2 అభిమానుల ముందుకు వస్తుందట. లేదంటే దసరాకే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే మొత్తానికి 2024లో మధ్యలో ఈ పుష్ప 2 రావడం పక్కా అని తెలిసింది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు.. సుక్కు మరో జక్కన్నలా తయారయ్యాడే అని కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here