Bigg Boss Telugu : గత వారం జరిగిన ఎలిమినేషన్స్ టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హౌస్ లో మొదటి రోజు నుండి ఫిజికల్ టాస్కులలో పెద్దగా ఆడకపోయినా కూడా , ఎంటర్టైన్మెంట్ పంచడం లో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు. అయితే గౌతమ్ ని బెల్ట్ తో మెడ మీద కొట్టిన టాస్కు అప్పుడు తేజా కి బాగా నెగటివ్ అయ్యింది కానీ, మళ్ళీ ఆయన తన తప్పుని సరిచేసుకొని అలాంటి పొరపాట్లు చెయ్యకుండా, తన స్థానం ని బిగ్ బాస్ లో పదిలం చేసుకున్నాడు.
అందరి అంచనాలను పరిగణలోకి తీసుకుంటే గత వారం శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె బదులుగా టేస్టీ తేజా ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. దీనిపై సోషల్ మీడియా లో నెగటివిటీ కూడా ఏర్పడింది. స్టార్ మా బ్యాచ్ ని కావాలనే మ్యానేజ్ మెంట్ సేవ్ చేస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియా లో ఉన్న వెబ్ సైట్స్ మరియు యూట్యూబ్ లో జరిగిన పొలింగ్స్ అన్నిట్లో కూడా శోభా శెట్టి అతి తక్కువ ఓట్లతో చివరి స్థానం లో ఉంది. టేస్టీ తేజా మంచి ఓటింగ్ తోనే ఉన్నాడు. ఇన్ని వారాలు ఎలిమినేషన్స్ సోషల్ మీడియా లో జరిగిన పొలింగ్స్ కి దగ్గరగానే ఉండేవి. కానీ ఈ ఒక్క వారం మాత్రమే సోషల్ మీడియా పొలింగ్స్ కి ఎలిమినేషన్ కి సంబంధం లేకుండా ఉంది.
అందుకే ఈ ఎలిమినేషన్ లో న్యాయం లేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. శోభా శెట్టి తో బిగ్ బాస్ యాజమాన్యం హౌస్ లోకి అడుగుపెట్టే ముందే 10 వారాలు అగ్రిమెంట్ చేయించుకుందని, ఈ వారం ఆమె కెప్టెన్ కాబట్టి నామినేషన్స్ నుండి సేవ్ అయ్యిందని, వచ్చే వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా టేస్టీ తేజా కి మాత్రం బిగ్ బాస్ తీరని అన్యాయం చేసాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.