Bigg Boss Telugu : ‘ఫౌల్’ గేమ్స్ ఆడుతూ ఈ వారం అడ్డంగా దొరికిపోయిన ‘స్పై’ బ్యాచ్.. నాగార్జున కోటింగ్ ఇస్తాడా లేదా?

- Advertisement -

Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు అమర్ దీప్ మరియు సందీప్ మొదటి నాలుగు వారాలు దొంగాటాలు చాలానే ఆడారు. అలా ఆడి వీకెండ్స్ లో హోస్ట్ నాగార్జున చేత బాగా తిట్టించుకునే వాళ్ళు. కానీ ఆ తర్వాత అమర్ దీప్ తన ఆట తీరుని మార్చుకొని సాధ్యమైనంత వరకు ఫౌల్ గేమ్ ఆడకుండా నిజాయితీగా ఆడే ప్రయత్నం చేసాడు.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

కానీ శివాజీ బ్యాచ్, అనగా ‘స్పై’ బ్యాచ్ ప్రియాంక,అమర్ దీప్ మరియు శోభా శెట్టి పై ఫౌల్ గేమ్ ఆడుతున్నారు అంటూ ఒక ముద్ర వేసేసారు. ఇప్పటికీ కూడా ఈ ముగ్గురిపై స్పై బ్యాచ్ అదే ముద్ర వేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. కానీ ఈ వారం మాత్రం స్పై బ్యాచ్ ఫౌల్ గేమ్ ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. ముఖ్యంగా యావర్ కి అయితే ఈ వారం నాగార్జున చేతిలో తిట్లు తప్పేలా లేవు.

Shivaji

‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ టాస్కులో నాలుగు ఆటలు ఆడి గెలిచినా యావర్, మూడు ఆటలు ఫౌల్ గేమ్ ఆడి గెలిచాడు. ఆయన ఫౌల్ చేసినట్టుగా వీడియోలతో సహా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అలాగే బాణం టాస్కులో శివాజీ కూడా ఫౌల్ గేమ్ ఆడాడు. తప్పు చేసి బిగ్ బాస్ చేత వార్నింగ్ ఇప్పించుకున్నా కూడా శివాజీ తన తప్పు ఏమి లేదంటూ సంచాలక్ శోభా శెట్టి పై నోరు పారేసుకుని అడ్డం గా బుక్ అయిపోయాడు.

- Advertisement -
Shivaji Shoba

ఇదే ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్న అంశం. ఇక కెప్టెన్సీ టాస్కులో కూడా ఇటుకలు దొంగతనం చేసి శివాజీ తో పాటుగా పల్లవి ప్రశాంత్ కూడా దొరికిపోయాడు. ఇలా ఈ ముగ్గురు దొరికిపోవడం తో నాగార్జున నుండి కనీసం ఈ వారం అయినా వీళ్లకు కోటింగ్ ఉంటుందా, లేదా ఎప్పటిలాగానే పట్టించుకోకుండా వదిలేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడో ఈ వీకెండ్ లో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here