Bigg Boss Telugu 7 : నిన్న బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఎంత ఘనంగా జరిగిందో మనమంతా చూసాము. రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అవ్వగా, అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. ఈ ఇద్దరి మధ్య హౌస్ లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అమర్ దీప్ అదుపుతప్పి ప్రశాంత్ తో తప్పుగా వ్యవహరించాడు.

దీనికి ప్రశాంత్ ఫ్యాన్స్ చాలా ఫైర్ అయ్యారు. నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో అమర్ దీప్ కార్ పై దాడి చేసారు. ఆ కార్ లో అమర్ భార్య తేజస్విని తో పాటుగా అమర్ తల్లి కూడా ఉంది. అయితే ప్రశాంత్ ఫ్యాన్స్ కేవలం అమర్ విషయం లో మాత్రమే అలా చెయ్యలేదు. ప్రిన్స్ యావర్ అన్నయ్య కార్ మీద, అలాగే అశ్వినీ కార్ మీద కూడా దాడి చేశారట.

అమర్ తో అంటే ప్రశాంత్ కి గొడవలు ఉన్నాయి, అందువల్ల ఆయన ఫ్యాన్స్ దాడి చేసారు అనుకోవచ్చు. కానీ యావర్ మొదటి నుండి ప్రశాంత్ కి బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంటూ వచ్చాడు. అశ్విని కూడా ప్రశాంత్ కి హౌస్ లో అడుగుపెట్టిన రోజు నుండి సపోర్ట్ చేస్తూ వచ్చింది. వీళ్ళ పై ఎందుకు దాడి చేసారు అని అనుకుంటున్నారు నెటిజెన్స్. అశ్విని అయితే తన ఇంటికి వెళ్ళగానే కార్ ని చూపించి నిరసన వ్యక్తం చేసింది.

ఎంత ఫ్యాన్స్ అయితే మాత్రం ఇలా చెయ్యడం కరెక్టా?, మేము కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకోవడం కోసమే కదా కష్టపడ్డాము అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ కార్ అద్దాలు కూడా పగలగొట్టారు. వీళ్లంతా నిజంగా పల్లవి ప్రశాంత్ అభిమానులేనా?, లేకపోతే ఆయన పేరు చెప్పుకొని దాడి చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.