Bigg Boss Telugu 7 : ఇప్పటి వరకు తెలుగులో ఆరు సీజన్లను ‘బిగ్ బాస్’ రియాలిటీ షో విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో ఏడో సీజన్ స్టార్ట్ కానుంది. అయితే… ఈసారి నాగార్జున బదులు రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. అందులో అసలు నిజం లేదని ‘బిగ్ బాస్7’ ప్రోమోతో తేల్చేశారు. దీంతో అన్ని పుకార్లు పటాపంచలయ్యాయి. దీంతో బిగ్ బాస్ హోస్ట్ గా మళ్లీ మన్మథుడే అనే విషయం ఖారారైంది.
తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ప్రోమో విడుదల చేశారు. అందులో కలర్ ఫుల్ గా కనిపించిన నాగార్జున చేతిలో పాప్ కార్న్ పట్టుకుని కనిపించారు. డ్రెసింగ్ స్టైలే కాదు.. మాటలోనూ అల్ట్రా స్టైలిష్ గా ఆకట్టుకున్నాడు. ప్రోమోతోనే ఆసక్తికలిగేలా చేశారు. ఈసారి సీజన్ చాలా కొత్తగా ఉంటుందనే విషయాన్ని వెరైటీగా చెప్పాడు నాగ్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ” అంటూ చిటికె వేయగానే.. అక్కడ ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని ఒక్కసారిగా రివర్స్ అవ్వడం చూపించారు.
దీంతో ఇప్పటి వరకు ఓ లెక్క ఈ సీజన్ ఓ లెక్క అంటూ తెలిసేలా చేశారు. ప్రస్తుతం ఈ సీజన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈసారి ఈ సీజన్ లో ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారో.. వారిని నాగ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అంటూ నెటిజన్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు బిగ్ బాస్ ఇంటిలో అడుగు పెట్టె సెలబ్రెటీలు ఎవరు? అని చర్చ మొదలైంది. ‘ఈటీవీ’ ప్రభాకర్, ‘కార్తీక దీపం’ సీరియల్లో డాక్టర్ బాబును ప్రేమించిన మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టి, ‘బుల్లెట్ బండి’ సాంగ్ ఫేమ్ మోహన భోగరాజు, ‘ఢీ’ షోలో ‘నక్కిలీసు గొలుసు’ పాటతో పాపులరైన డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్ పండు, బుల్లితెరపై లవ్లీ జోడీ అమర్ దీప్, తేజస్విని తదితరులు వెళ్లవచ్చని తెలుస్తోంది. ‘బిగ్ బాస్‘ తెలుగు ఆరో సీజన్ ఆశించిన రేటింగ్స్ అందుకోలేదు. అందుకని, స్టార్ మా ఛానల్ యాజమాన్యం, షో నిర్వాహకులు ఇంటిలో అడుగు పెట్టే కంటెస్టెంట్లతో పాటు థీమ్ & స్కిట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టిందట. సరికొత్త కొత్త టాస్కులతో గేమ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.