Bigg Boss : మూడో పవర్ అస్త్రా కోసం పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లను పవర్ అస్త్రా కోసం బిగ్ బాస్ ఎంపిక చేశారు. కానీ బిగ్ బాస్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని కంటెస్టెంట్స్ ఒప్పుకోలేకపోయారు. దీంతో ఆ ముగ్గురు ఎందుకు అనర్హులు అనే విషయాన్ని ప్రతీ కంటెస్టెంట్ చెప్పారు. తమ తమ అభిప్రాయాలను విన్న తర్వాత బిగ్ బాస్..
ఆ కంటెస్టెంట్స్‌కు అసలైన ట్విస్ట్ ఇచ్చాడు. వారి కన్ఫెషన్ రూమ్‌లో సీక్రెట్‌గా చెప్పిన విషయాన్ని.. అందరి ముందు బయటపెట్టాడు. ప్రిన్స్ యావర్‌ను కంటెస్టెంట్స్ ఎందుకు అనర్హుడు అనుకుంటున్నారో.. బిగ్ బాస్ ఇప్పటికే వీడియోలు చూపించారు. ఇప్పుడు అమర్‌దీప్, శోభా శెట్టి టర్న్ వచ్చింది. ఇక ముందుగా శోభా శెట్టి ఎందుకు అనర్హురాలు అని కంటెస్టెంట్స్ అనుకుంటున్నారో వీడియోలు చూపించారు బిగ్ బాస్. దీంతో శోభాకు, గౌతమ్‌కు మధ్య గొడవ మొదలయ్యింది. ‘‘నువ్వు చెప్పింది బక్వాస్ రీజన్’’ అని గౌతమ్‌పై అరిచింది శోభా.
‘‘నేను జిమ్ చేస్తే నీకెంటి సమస్య’’ అని ఎదురుప్రశ్న వేశాడు గౌతమ్. ‘‘అందుకే ఏం చేయలేకపోయావు’’ అంటూ శోభా హేళన చేసింది. ఆ మాటకు కోపం తెచ్చుకున్న గౌతమ్.. ఒక్కసారిగా తన షర్ట్‌ను విప్పి చూపించాడు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు అరచుకోవడం మొదలుపెట్టారు. ఒకరు గట్టిగా అరిస్తే.. వారికంటే గట్టిగా మరొకరు అరిచారు. వాదించి విసిగిపోయిన శోభా శెట్టి.. గార్డెన్‌లో వెళ్లి కూర్చుంది. ఒక డంబుల్ తీసుకొని అక్కడికి వచ్చిన గౌతమ్.. ‘‘నా బాడీ నా ఇష్టం’’ అంటూ వర్కవుట్ చేయడం మొదలుపెట్టాడు.