Sandeep Master పై పరువు నష్టం దావా వేయనున్న బిగ్ బాస్ యాజమాన్యం..? నాగార్జున రియాక్షన్ ఏమిటంటే!

Sandeep Master


Sandeep Master : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన వారిలో ఒకరు ఆట సందీప్. మన చిన్నతనం నుండి ఈయన్ని టీవీ లో చూస్తూనే ఉన్నాం. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ఆట డ్యాన్స్ షో , అలాగే స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ఛాలెంజ్ డ్యాన్స్ షో ద్వారా సందీప్ బాగా ఫేమస్ అయ్యాడు.

Sandeep Master
Sandeep Master

బిగ్ బాస్ లోకి అడుగుపెట్టక ముందు కూడా ఆయన ‘నీతోనే డ్యాన్స్’ అనే ప్రోగ్రాం లో తన భార్య తో కలిసి అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లు చేసి టైటిల్ ని సొంతం చేసుకున్నాడు. కచ్చితంగా ఇతను బిగ్ బాస్ టైటిల్ కూడా సొంతం చేసుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఈయన సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చాడు. టాస్కులు బాగానే ఆడాడు కానీ, బయట కనిపించిన సందీప్ ఇక్కడ కనిపించట్లేదే అని అందరూ అనుకున్నారు.

మొదటి 8 వారాలు నామినేషన్స్ కి రాని సందీప్, ఒకే ఒక్కసారి నామినేషన్ లోకి రావడం తో ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఎలిమినేట్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు సందీప్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బిగ్ బాస్ పై, అందులో ఉన్న కంటెస్టెంట్స్ పై ఎదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు.

Sandeep Master nagarjuna

రీసెంట్ గా ఆయన ఇంస్టాగ్రామ్ లో ‘జనాల ఓట్లతో సంబంధం లేకుండా కంటెస్టెంట్స్ ని సేవ్ చేసేందుకు ఎందుకు అయ్యా ఇక ఈ షో.. మీకు నచ్చిన వాళ్ళకే కప్పు ఇచ్చుకో’ అంటూ ఆయన షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలా తరచూ బిగ్ బాస్ పై ఆరోపణలు చేస్తున్న సందీప్ పై పరువు నష్టం దావా వేసేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.