Tasty Teja : టేస్టీ తేజ కి గుండెపోటు..హాస్పిటల్ కి తీసుకెళ్లిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్!

- Advertisement -

Tasty Teja : యూట్యూబ్ ద్వారా మంచి ఫేమ్ ని సంపాదించి, ఆ ఫేమ్ తో బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన టేస్టీ తేజా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా చేరువ అయ్యాడు అనే విషయం వాస్తవం. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించి తనదైన మార్కు వేసి 9 వారాలు ఆయన బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాడు.

Tasty Teja
Tasty Teja

అంతకు ముందు టేస్టీ తేజా టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ తో ఎన్నో ఫుడ్ వీడియోలు చేసాడు. బయటకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎన్నో ఫుడ్ వీడియోలు చేసాడు. రీసెంట్ గా ఆయన తన తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ తో కలిసి చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో ని చూసి కొంతమంది నెటిజెన్స్ తిడుతున్నారు కూడా.

అసలు విషయం లోకి వెళ్తే ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ టేస్టీ తేజా ని తన ఇంటికి గెస్ట్ గా పిలుస్తాడు. టేస్టీ తేజా వచ్చిన వెంటనే శివ్ ఆయనతో మాట్లాడుతూ ‘ఈరోజు ప్రియాంక ని వేరే లెవెల్ ప్రాంక్ చేయబోతున్నాను. మీకు గుండెపోటు వచ్చినట్టు నటించాలి’ అని అంటాడు. ముందుగా షాక్ కి గురైన తేజా, ఆ తర్వాత నటించడానికి ఒప్పుకుంటాడు.

- Advertisement -

తర్వాత ఇంటి లోపలకు వెళ్లి ప్రియాంక తో కాసేపు మాట్లాడి వంటింట్లో క్యారెట్ హల్వా చెయ్యడానికి సిద్ధం అవుతాడు తేజా. అలా వంటా చేస్తూ గుండెపోటు వచ్చినట్టు క్రింద పడిపోతాడు. ప్రియాంక అతడిని చూసి భయపడిపోతుంది. వెంటనే అంబులెన్సు పిలువు అని రచ్చ చేస్తుంది. చివరికి అది ప్రాంక్ అని తెలిసి ఒక్కసారిగా షాక్ కి గురైన ప్రియాంక తన ప్రియుడు శివ్ ని చితకబాదుతుంది . ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here