Actress : స్టార్ హీరో ప్రేయసి డ్రగ్స్ కేస్ లో అరెస్ట్..మండిపడుతున్న ఫ్యాన్స్!

- Advertisement -

Actress : హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి అనే ప్రాంతం లో లావణ్య అనే యువతి డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ అయ్యింది. ఈమె నుండి పోలీసులు నాలుగు గ్రాముల ఎండీఎంఏ మత్తుపదార్ధాలను స్వాధీన పర్చుకున్నారు. ఈమెని అదుపులోకి తీసుకొని విచారించగా చాలా విషయాలు బయటపడ్డాయి. ఈమె ఒక మ్యూజిషియన్ అట, అంతే కాకుండా టాలీవుడ్ లో ఒక ప్రముఖ యంగ్ హీరో తో ఈమె చాలా కాలం నుండి ప్రేమలో ఉన్నట్టుగా కూడా తెలిసింది.

Actress
Actress

గోవా ప్రాంతం నుండి లావణ్య ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్టు విచారణ తెలిసింది. ఈ సందర్భంగా ఆమెపై ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ క్రింద పోలీసులు కేసు నమోదు చేసారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కోకాపేటలోని ఒక అపార్ట్మెంట్ లో లావణ్య నివసిస్తూ ఉంది. సరిగ్గా మూడు నెలల క్రితం వరలక్ష్మీ టిఫిన్స్ అధినేత పై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. కానీ తనకి తెలిసిన కొంతమంది సినీ ప్రముఖుల పలుకుబడితో ఆమె పేరుని బయటకి రాకుండా చేసుకుంది.

అప్పటి నుండి ఈమెని అనుమానించిన పోలీసులు ఈమెపై ప్రత్యేకమైన నిఘా వేశారు. డ్రగ్స్ తీసుకెళ్తున్నారు అనే పక్కా సమాచారం రావడం తో పోలీసులు నిన్న సాయంత్రం నుండి లావణ్య ఇంటిబయట తిష్ట వేశారు . ఆమె బయటకి వచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమం లో నార్సంగి పోలీసులు అదుపులో తీసుకొని, ఆమె హ్యాండ్ బ్యాగ్ ని తనిఖీ చెయ్యగా నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ లభించాయి.

- Advertisement -

ఈ క్రమం లో ఆమెని విచారించగా, ఈ డ్రగ్స్ తనకి ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చినట్టుగా తెలిపింది. దీంతో వెంటనే ఉనిత్ రెడ్డి ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుండి ఈ డ్రగ్స్ ని తీసుకొచ్చినట్టుగా ఈ విచారణలో తేలింది. ఇది ఇలా ఉండగా లావణ్య మ్యూజిషియన్‌గా పనిచేస్తుండటంతో సినీ ఇండస్ట్రీలోనూ ఈమెకి పరిచయాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఈమె సినీ ప్రముఖులకు కూడా డ్రగ్స్ ని విక్రయిస్తుందా అనే కోణం లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here