Bigg Boss సీజన్ 7 ఎంత ఆసక్తికరంగా సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం , సరికొత్త టాస్కులతో, ఆసక్తికరమైన గేమ్ తో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకుంటూ ముందుకు పోతుంది. ప్రతీ వారం ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించే టాస్కుల్లో ఒక్కటి ‘పవర్ అస్త్ర’ టాస్క్. ఒకప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఉండేది, ఇప్పుడు అది పవర్ అస్త్ర టాస్కు గా మారింది. ఈ టాస్కు గెలిచిన వాళ్ళు కొన్ని వారాలు నామినేషన్స్ నుండి ఇమ్మ్యూనిటీ దక్కించుకొని ఇంటి సభ్యులు అవుతారు.

ఇప్పటి వరకు ఈ టాస్కులో శోభా శెట్టి , శివాజీ మరియు సందీప్ గెలిచి ఇంటి సభ్యులు అయ్యారు. ఈ వారం ఈ టాస్కులో పోటీపడేందుకు ప్రశాంత్, యావర్ మరియు శుభ శ్రీ నిలిచారు. వీరిలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు యావర్ , తేజ, రతికా, ప్రియాంక, శుభ శ్రీ మరియు గౌతమ్ నామినేట్ అయ్యారు.

వీరిలో ఈ వారం రతికా మరియు తేజాలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతే కాదు, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది అంటున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే రతికా మరియు తేజా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా రేపు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 7 మంది కొత్త కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఆ కంటెస్టెంట్స్ ఎవరు అంటే టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అంబటి అర్జున్, యాంకర్ ప్రత్యుక్ష్య, హీరోయిన్ ఫర్జానా, భోలే షవాలి, సుప్రీతా, అంజలి – పవన్. ఈ 7 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అట. ఒకవేళ అదే నిజమైతే ఆట రసవత్తరంగా ఉంటుంది. గడిచిన రెండు సీజన్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ కాన్సెప్ట్ లేదు. అందుకే ఈసారి ఈ కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టారు, ఈ కొత్త కంటెస్టెంట్స్ రావడం వల్ల ఆట ఎలా మారబోతుందో చూడాలి.
