Balakrishna .. మజాకా.. ఎవరైన పడిపోవాల్సిందే.. వీడియో వైరల్..

- Advertisement -

నందమూరి నట సింహం Balakrishna తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన ఎక్కడ కనిపించినా కూడా వదలరు.. ముఖ్యంగా మాస్‌ అభిమానుల్లో బాలయ్యకు భారీ ఫాలోయింగ్‌ ఉంటుంది.. ఆయన సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా వచ్చి వెళ్లే వరకు హంగామా చేస్తూనే ఉంటారన్న విషయం తెలిసిందే.. ఇక సందర్భమేదైనా ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు వినిపించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడలో బాలయ్య సందడి చేశారు. అక్కడ ఓ బామ్మా బాలయ్యను వదలకుండా పట్టుకుంది.. తనని వదలను అని మారాం చేసింది.. అందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

Balakrishna
Balakrishna

ఇకపోతే బాలయ్య తన అఖండ హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి ఓ నగల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు విజయవాడ బందర్‌ రోడ్డుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి నటసింహంతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్‌ పోటీపడ్డారు. ఈక్రమంలో అక్కడ ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బాలయ్య మాట్లాడే సమయంలో ఒక వృద్ధురాలు ఆయన దగ్గరకు వచ్చింది. బాలయ్యను దగ్గర నుంచి చూడటమే కాకుండా ఆయన మాట్లాడుతుంటే గట్టిగా పట్టుకుంది. బాలయ్య కూడా ఆవిడ అభిమానం చూసి ఆప్యాయంగా భుజం మీద చేయి వేశారు. భద్రతా సిబ్బంది ఆమెని కిందకు వెళ్లమని కోరారు. అయితే వృద్ధురాలు మాత్రం బాలకృష్ణ ను పట్టుకుని వదలను అన్నట్లు తల ఊపుతూ కాసేపు మారాం చేసింది..

balakrishna at vega jewellers

ఇక చివరకు భద్రతా సిబ్బంది బతిమాలడంతో సరే పోనీ అన్నట్లుగా బాలయ్యను వదిలి కిందకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఈ వీడయోను నెట్టింట్లో షేర్‌ చేస్తూ హంగామా చేస్తున్నారు. బాలయ్యను ఆ బామ్మను దగ్గరకు తీసుకోవడం, ఆమెపై ఆప్యాయంగా చేయి వేసి మాట్లాడటం చూసి ‘మా బాలయ్య మనసు వెన్న’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇక ఇప్పుడు యాడ్ లు కూడా చేస్తున్నారు… ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here