తెలుగు ప్రేక్షకులు ప్రతీ ఏడాది ఎంతో ఆత్రుతతో ఎదురు చూసే ఎంటర్టైన్మెంట్స్ షోస్ లో ఒకటి బిగ్ బాస్. మన తెలుగు కంటే ముందుగా ఈ షో హిందీ , తమిళం , కన్నడం మరియు మలయాళం భాషల్లో మొదలైంది. కానీ ఎక్కడా రానటువంటి రెస్పాన్స్ మన తెలుగులోనే వచ్చింది. ఆరవ సీజన్ పెద్ద హిట్ కాలేదు కానీ, అంతకు ముందు ప్రసారమైన సీజన్స్ స్టార్ మా ఛానల్ ని ఇండియా లోనే నెంబర్ 1 స్థానం లో కూర్చోబెట్టింది.

అయితే ఇన్ని సీజన్స్ మనం చూసిన బిగ్ బాస్ వేరు, త్వరలో ప్రసారం అవ్వబోతున్న బిగ్ బాస్ 7 వేరు. ఈ సీజన్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉండబోతుంది అని అక్కినేని నాగార్జున ఇది వరకే ప్రోమోస్ లో తెలిపాడు. ఉల్టా పల్టా అంటూ ఆయన చేస్తున్న ప్రొమోషన్స్ ని చూసి, అంత కొత్తగా ఏమి ఉండబోతుంది అబ్బా అని ఆడియన్స్ ఆలోచిస్తున్నారు.

అది కాసేపు పక్కన పెడితే ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇవ్వబోయే టాస్కులు చాలా కఠినతరంగా ఉండబోతున్నాయి అట. వాటిని తట్టుకొనే కంటెస్టెంట్స్ హౌస్ లో ఉండలేరని అంటున్నారు. టాస్కులు కఠినంగా ఉంటాయి కాబట్టి,దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్స్ కూడా ఉండబోతున్నాయి అట. గత సీజన్ లో లాగ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్ కాకుండా, ఈసారి మొత్తం పాపులర్ సెలబ్రిటీస్ తో బిగ్ బాస్ హౌస్ ని నింపేయబోతున్నారని టాక్.

ఇప్పటి వరకు ఈ సీజన్ కి సంబంధించి కంటెస్టెంట్స్ లిస్ట్ ని అధికారికంగా అయితే ప్రకటించలేదు కానీ , సోషల్ మీడియా లో పలువురి పేర్లు ఎప్పటి నుండో ప్రచారం అవుతూనే ఉన్నాయి. అయితే ఈ సీజన్ పాల్గొనబోయే కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ తో పాటుగా, బిగ్ బాస్ హౌస్ కోసం వేసిన సెట్స్ మరియు ఇతర ఖర్చులన్నీ కలిపి సుమారుగా 47 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యాయని చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినా అన్నీ సీజన్స్ కంటే భారీ బడ్జెట్. టెలికాస్ట్ కి ముందే ఇంతలా ఆకర్షిస్తున్న ఈ సీజన్ ఎలాంటి ప్రేక్షకాదరణ దక్కించుకోబోతుందో చూడాలి.