బిగ్‌బాస్ షో ద్వారా ఒకేసారి తాను ఊహించనంతగా నేమ్, ఫేమ్ వచ్చాయని బిగ్‌బాస్ సొహెల్ చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన డౌన్‌ఫాల్‌ను తట్టుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యాడు. బిగ్‌బాస్ సొహెల్ హీరోగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ఆగస్ట్ 18న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల నాగార్జున రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్ వేడుకలో సొహెల్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

బిగ్‌బాస్ తన కెరీర్‌కు ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని పేర్కొన్నాడు. బిగ్‌బాస్ షో తో పాటు నాగార్జున వల్లే సొహెల్ అంటే ఎవరో తెలుగు ఆడియెన్స్‌కు తెలిసిందనిఅన్నాడు. బిగ్‌బాస్ ద్వారా ఒకేసారి చాలా నేమ్, ఫేమ్ వచ్చాయని సొహెల్ చెప్పాడు. సక్సెస్‌లు రావడం, డౌన్‌ఫాల్ కావడం సహజం. కానీ ఆ డౌన్‌ఫాల్‌ను తాను స్వీకరించలేకపోయానని సొహెల్ పేర్కొన్నాడు. డిప్రెషన్‌లోని వెళ్లిపోయానని తెలిపాడు.

ఆ డిప్రెషన్ టైమ్‌లో తాను ఉన్నానని ధైర్యం చెప్పి తన చేయిపట్టుకొని పైకి తీసుకొచ్చే ప్రయత్నం నాగార్జున చేశారని సొహెల్ పేర్కొన్నాడు. “బీబీ షైనింగ్ స్టార్ ఈవెంట్‌లో ట్రైలర్ లాంఛ్‌కు రావాలని నాగార్జున గారికి రిక్వెస్ట్ చేశాను. వెంటనే వస్తానని అంగీకరించారు నాగార్జున. మరో మాట కూడా మాట్లాడలేదు. నా మనసులో ఉన్న బాధను కనిపెట్టి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు నాగార్జున వచ్చారు అని “సొహెల్ పేర్కొన్నాడు. తల్లి గొప్పతనాన్ని చాటిచెప్పే మూవీగా మిస్టర్ ప్రెగ్నెంట్‌గా తెరకెక్కించామని సొహెల్ చెప్పాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీకి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించాడు. రూపా కొడయూర్ హీరోయిన్‌గా నటించింది.