Big Boss : బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరూ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు యావర్.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 11 మందిలో నిజాయితీగా ఉండే అతి తక్కువ మంది కంటెస్టెంట్స్‌లో ప్రిన్స్ కూడా ఒక్కడు. అయితే గత రెండు మూడు వారాలుగా.. హోస్ట్ నాగార్జున ప్రిన్స్‌ని పదే పదే ఆడటం లేదు.. ఆడటం లేదు.. డౌన్ అయిపోయావ్ అని అంటున్నారు. నిజానికి ప్రిన్సే కాదు.. హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్సూ పొడిచిందేం లేదు. కానీ.. పని కట్టుకుని ప్రిన్స్‌నే ఆడటం లేదని అంటున్నారంటే తెరవెనుక పెద్ద కథే.

ఇక ఈ సీజన్ ఎలగూ ఉల్టాపల్టా కాబట్టి అన్ని సీజన్లకంటే కాస్త ముందుగా వచ్చింది ఫ్యామిలీ వీక్. ప్రతి సీజన్‌లో 80 ఎపిసోడ్‌ల తరవాత ఫ్యామిలీ వీక్ ఉండేది. అయితే ఈ ఉల్టా పుల్టా సీజన్‌లో పదోవారంలోనే ఫ్యామిలీ వీక్‌ని మొదలుపెట్టారు. ఇక హౌస్‌లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రావడం.. ఏడ్వడం.. లీక్‌లు అందించడం.. ప్రోమోలతో దంచికొట్టడం.. ఆ ఎమోషన్స్.. ఆ డ్రామాలు మిగిలిన వన్నీ ఎప్పుడూ ఉండే తంతే. ఇక ఎలిమినేషన్ విషయానికొస్తే.. ప్రస్తుతం టాప్ 5లో శివాజీ, ప్రశాంత్,అమర్ దీప్, అంబటి అర్జున్, యావర్/ప్రియాంక ఉన్నారు. వీళ్లలో శివాజీని కదిలించే ధైర్యం ఎవరూ చేయరు. ఎందుకంటే ఆయన లేకపోతే బిగ్ బాస్ ఏ లేడు.. ప్రియాంకని టాప్‌లో పెడితే.. యావర్ లేదా అర్జున్‌లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సిందే.

అర్జున్‌ని ఎలిమినేట్ చేసే సాహసం చేయకపోవచ్చు కానీ.. గత రెండు వారాలుగా హౌస్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ప్రియాంకని టాప్ 5లో పెట్టే పనిలో భాగంగా.. యావర్‌ని ఎలిమినేట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్.. ఈ ముగ్గురూ టాప్ 3 ఫిక్స్ కాబట్టి.. అర్జున్ టాప్ 4, ప్రియాంకల్ని టాప్ 5గా హౌస్‌లో ఉంచొచ్చు. మిగిలిన రతిక, అశ్విని, భోలే, శోభా, గౌతమ్‌లు హౌస్ నుంచి ఎలిమినేట్ కావాల్సిన వాళ్లే. అయితే గౌతమ్‌కి కూడా టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది కానీ.. అర్జున్, యావర్, గౌతమ్.. ఈ ముగ్గురిలో ఒకరికే టాప్ 5 ఛాన్స్ ఉండే అవకాశం ఉండటంతో.. టఫ్ ఫైట్‌లో గౌతమ్‌కి టాప్ 5 ఛాన్స్ ఉండకపోవచ్చు.