వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. కానీ సీజన్ 6 తరువాత వరల్డ్ వరస్ట్ రియాలిటీ షోగా మారింది. అంత దారుణంగా సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి ఊసేలేకుండా పోయింది. అయితే ఈసారి పక్కా వ్యూహంతో సీజన్ 7ని ఎలాగైనా సక్సెస్ బాట పట్టించాలనే వ్యూహంలో ఉన్నారట నిర్వాహకులు. దానిలో భాగంగా ఈసారి మరికాస్త ఆలస్యం అయ్యేట్టు కనిపిస్తోంది. అయితే సీజన్ 7 ఎప్పటి మాదిరిగానే ఉంటుందా? హోస్ట్ నాగార్జుననే ఉంటారా, కొత్త కంటెస్టెంట్స్ ఎవరు ఇలా అనేక విషయాలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు గమనిస్తే.. ఒకటవ సీజన్ కి హోస్టుగా ఎన్టీఆర్, రెండవ సీజన్ కి హోస్టుగా నాని , మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేశారు.అయితే రెండు మూడు సీజన్స్ పెద్దగా అలరించలేకపోయాయి. బిగ్ బాస్ కి లీక్ ల బెడద వస్తున్న నేపథ్యంలో పక్కా పగడ్బందీ తో షో నీ ప్లాన్ చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. ఇకపోతే ఈసారి ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లో కిక్ ఇచ్చే చేంజెస్ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. 2023 సెప్టెంబర్ 02 ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభంకాబోతున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 2 తప్పితే.. సెప్టెంబర్ 9 ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అంతేకాదు ఈ సారి సీజన్ హాట్ హాట్ గా ఉండనుందట. ఇక కంటెస్టెంట్ ల విషయానికొస్తే.. అమర్ దీప్ అతని భార్య, యాంకర్ దీపికా పిల్లి, యూట్యూబర్ నిఖిల, నటి ఐశ్వర్య, సింగర్ హేమ చంద్ర, డ్యాన్సర్ శ్వేత నాయుడు, నటి మిత్రా శర్మ, నటి శోభ శెట్టి, ట్రాన్స్‌జెండర్ తన్మయి, మోడల్ సాయి రోనక్, న్యూస్ రీడర్ ప్రత్యూష, సింగర్ మోహన భోగరాజు, యాంకర్ రష్మీ, కమెడీయన్ రష్మీ, సింగర్ మంగ్లీ, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ఇలా పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 7లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈసారి మంచి టిఆర్పి రేటింగ్ కొట్టడానికి భారీగా ప్లాన్లు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈసారి సీజన్ సెవెన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.