ఉల్టా పుల్టా సీజన్ అంటూ అసలు బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కాకముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు మేకర్స్. మామూలుగానే టాస్కులతో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే బిగ్ బాస్.. ఈసారి డోస్ పెంచనున్నాడని అంచనాలు పెంచేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ తర్వాత చాలామంది కంటెస్టెంట్స్.. ప్రేక్షకులకు తెలియకపోయినా వారి టాలెంట్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తున్నారు.

మొదటి వారంలో ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించలేక సీనియర్ నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. రెండో వారంలో శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రశాంత్, షకీలా, శోభా శెట్టి, అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, రతిక నామినేషన్స్‌లో ఉన్నారు. నామినేషన్స్ విషయంలో శివాజీకే కంటెస్టెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ ఓట్లు పడ్డాయి. మొదటి వారంతో పోలిస్తే రెండో వారం నామినేషన్స్ అనేవి ప్రేక్షకులను ఆకర్షించేలా సాగాయి. పైగా ఈ నామినేషన్స్ మాత్రమే రెండురోజులు ప్రసారం చేశారు బిగ్ బాస్.

నామినేషన్స్‌లో ఉన్న 9 మందిలో పల్లవి ప్రశాంత్‌కే బయట నుంచి ఎక్కువ సపోర్ట్ దక్కుతుందని ఓటింగ్ రిజల్ట్స్ చెప్తున్నాయి. ఎక్కువగా ఓట్లు దక్కించుకున్న వారి లిస్ట్‌లో పల్లవి ప్రశాంత్ తర్వాత స్థానంలో శివాజీ ఉన్నాడు. శివాజీ తర్వాత స్థానంలో అమర్‌దీప్ ఉన్నాడు. తర్వాత స్థానాల్లో రతిక, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. శోభా శెట్టి, షకీలా, టేస్టీ తేజ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అందులోనూ ముఖ్యంగా షకీలా, టేస్టీ తేజ.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.