Big boss Ariyana : బిగ్ బాస్ షోకి వెళ్లి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది అరియాన (Ariyana). ఇక ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత చాలా రియాలిటీ షోల్లో కనిపించి సందడి చేసింది. ఇక ఈ అమ్మడు అడపాదడపా టీవీ చానెల్లలోనూ కనిపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు తన ఫొటోలతోనూ అరియాన రచ్చరేపుతుంటుంది. అందాలు కనిపించేలా ఫొటోలు పెడుతూ ఎప్పుడూ జనాల్లో తన పేరు వినిపించేలా చూసుకుంటూ ఉంటుంది.
కొన్ని రోజుల నుంచి ఈ అమ్మడు ప్రేమలో ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అరియాన పెట్టిన ఓ కామెంట్ తో మరోసారి ఈ వార్త తెరపైకి వచ్చింది. ఒకరిని ప్రేమించాలనే భావన లేకుండా ప్రేమలో పడిపోతాం. అదే నిజమైన ప్రేమ. ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది… అంటూ కామెంట్ పెట్టారు. అరియనా ప్రేమ కథలు వల్లిస్తున్న నేపథ్యంలో ఆమె రిలేషన్ లో ఉన్నారని కొందరు అంచనా వేస్తున్నారు. ఆ లక్కీ ఫెలో ఎవరని అడుగుతున్నారు. గతంలో అరియనా మ్యారేజ్ పై తన అభిప్రాయం చెప్పారు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని సెటిలైపోతాను. భార్యగా మారి పిల్లల్ని కని వారి ఆలనా పాలనా చూసుకోవడం, భర్తకు సేవలు చేయడం ఇష్టమని చెప్పారు. ఆ మాటలు చెప్పి చాలా కాలం అవుతుండగా అరియనా మాత్రం వివాహం చేసుకోలేదు.
తాజాగా ఆమె చీరకట్టులోనూ హాట్ గా కనిపిస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. స్లీవ్ లెస్ జాకెట్, శారీ ధరించి మెస్మరైజ్ లుక్ లో ఆకట్టుకుంది. క్లీవేజ్ అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పించింది. అరియానాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది. హౌస్లో అరియనా ముక్కుసూటితనం, ప్రశ్నించే తత్వం ఆమెను ప్రేక్షకులు ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది.