Bigg Boss Vasanthi : గత ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన వాసంతి, ఈ షో ద్వారా ఎంత మంచి పాపులారిటీ ని సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అద్భుతంగా టాస్కులు ఆడడమే కాదు, తన అందచందాలతో కుర్రాళ్లను మంత్రం ముగ్దులను చేసింది ఈ ముద్దుగుమ్మ.అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం ఎంతో పద్దతి గా, ప్రతీ తెలుగోడు నచ్చేటట్టు ప్రవర్తించిన వాసంతి.

హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత తన తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ ని ముద్దులు పెట్టుకోవడం దగ్గర నుండి బీబీ జోడి లో జంటగా వీళ్లిద్దరు కలిసి హాట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేదాకా ఆమె ప్రయాణం చూస్తూ ఉంటే ‘అమ్మో..ఈమె కూడా మామూలు అమ్మాయి కాదు’ అని అనిపిస్తుంది.హాట్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ మాత్రమే కాదు, ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అనే విషయం బీబీ జోడి షో చూసిన తర్వాతే అర్థం అయ్యింది.

ఆథార్ కార్డులో కూడా అందంగా కనిపించేలా ఉండే వాసంతి కి కేవలం బీబీజోడి లో మాత్రమే కాదు, ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ టీవీ సీరియల్ తో పాటుగా, పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది.రీసెంట్ గా ఆమె కీలక పాత్ర పోషించిన ‘గేమ్ ఆన్’ అనే సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది.ప్రముఖ హీరో విశ్వక్ సేన్ ఈ టీజర్ ని లాంచ్ చేసారు.

ఈ చిత్రం లో హీరో గా గీతానంద్, హీరోయిన్ గా నేహా సోలంకి నటిస్తుండగా, వాసంతి ఒక చిన్న పాత్రని పోషించింది. వాసంతి షాట్స్ కూడా ఈ టీజర్ లో ఉన్నాయి, అవి మామూలు సన్నివేశాలు కాదు, హీరో తో లిప్ లాక్ సన్నివేశాలతో రెచ్చిపోయింది. అది చూస్తే బిగ్ బాస్ లో అంత అమాయకంగా కనిపించిన వాసంతియేనా ఈ అమ్మాయి అని ఆశ్చర్యపోక తప్పదు.ఆ టీజర్ ని మీరు కూడా క్రింద చూసేయండి.