Anchor Swapna : న్యూస్ రీడర్ స్వప్న రెండో పెళ్లి..?? వైరల్ ఫోటోలు మార్ఫింగ్??

- Advertisement -

Anchor Swapna : ఈ మధ్య కాలంలో సినిమా హీరోయిన్లు మాత్రమే కాదు యాంకర్లు కూడా రెండో పెళ్లి చేసుకుంటున్నారు.. గతంలో చాలా మంది యాంకర్స్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.. ఇప్పుడు తాజాగా మరో యాంకర్ రెండో పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా?.. ఆమె ఎవరో కాదండి ప్రముఖ న్యూస్ యాంకర్ స్వప్న.. వార్తకు చూసేవారికి ఈమే పేరు తెలిసే ఉంటుంది.. గతంలో ఆమె ఓ పెళ్లి చేసుకొని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుంది.. ఇప్పుడు 47 వయస్సులో పెళ్లికి రెడీ అయ్యిందని వార్త వైరల్ అవుతుంది..

Anchor swapna
Anchor swapna

యాంకర్ స్వ‌ప్న ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొన్ని టీవీ షోలతో పాటు కొన్ని సినిమాల్లో కూడా ఈమె కనిపించింది. హైదరాబాద్ కు చెందిన స్వప్న.. ఎఫ్. ఎం.రేడియో ప్రెజెంటర్ గా వర్క్ చేసింది. అటు తర్వాత దూరదర్శన్ లో పనిచేసింది. కొంతకాలం తర్వాత టీవీ9లో చేరి బాగా పాపులర్ అయ్యింది.. అలా అన్ని టీవీ ఛానెల్స్ పని చేసిన అనుభవం ఆమెకు ఉందని చెప్పడంలో సందేహం లేదు..అక్కడ 10 ఏళ్ళ వరకు పని చేసింది. ఆ తర్వాత సాక్షి, 10 టీవీ వంటి వాటిలో కూడా పనిచేసింది. ఇదిలా ఉండగా.. త్వరలో ఈమె ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకోబోతుందట.

Anchor swapna marriage

అందుకోసం ఈమె అమెరికా వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా వెల్లడించలేదు. ఆమె సన్నిహితులు కూడా ఈ విషయం పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.. కానీ వార్తలు గుప్పుమంటున్నాయి.. ఈమె వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు. గతంలో ఈమె పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. కొన్నాళ్లుగా ఆమె సింగిల్ గానే జీవిస్తూ వస్తుంది. అయితే ఈమె రెండో పెళ్లి చేసుకున్నట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది మార్ఫింగ్ అంటూ ఆమె స్నేహితులు కొట్టిపారేస్తున్నారు. స్వప్న స్వయంగా ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప ఈ వార్తలకు చెక్ పడేలా లేదు.. చూద్దాం ఆమె ఎం చెబుతుందో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here