Bigg boss Divi : ఇండస్ట్రీ లో గత కొంతకాలం నుండి కాస్టింగ్ కౌచ్ సమస్య పై పలువురు హీరోలు మరియు హీరోయిన్లు రకరకాలు కామెంట్స్ చేస్తూ వచ్చారు.కొంతమంది ఈ కాస్టింగ్ కౌచ్ గురించి పాజిటివ్ గా మాట్లాడితే, మరికొంతమంది మాత్రం తీవ్రంగా ఆరోపిస్తూ వస్తున్నారు.మీడియా ముందుకు వచ్చిన రచ్చ రచ్చ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కి సైతం ఈ కాస్టింగ్ కౌచ్ కి గురి అవ్వక తప్పలేదని ఇంటర్వ్యూస్ చెప్తూ రావడం మనం గమనిస్తూనే ఉన్నాం.
రీసెంట్ గా బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ మరియు క్రేజ్ దక్కించుకున్న దివి కాస్టింగ్ కౌచ్ పై ఎవ్వరు ఊహించని రీతిలో సమాధానం చెప్పింది.ఆమె మాట్లాడుతూ ‘మన ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ సమస్య ఇప్పుడొచ్చింది కాదు, ఎప్పటి నుండో ఉంది, అది అందరి హీరోయిన్స్ విషయం లో ఒకేలాగా ఉండదు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘కొంతమంది దీనిని ధైర్యం గా ఎదిరించి మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మాత్రం బలైపోతూ ఉంటారు. అయితే కెరీర్ లో ఉన్నతస్థానానికి వెళ్ళాలి అనే కలలుగన్న వారు కమిట్మెంట్స్ ఇవ్వడం లో నాకు ఎలాంటి తప్పు కనించడం లేదు. ఎవరి ఛాయస్ వారిది’ అంటూ దివి చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక దివి కెరీర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆమె బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొనే ముందే, కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా మరికొన్ని సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించింది. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత మాత్రం ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది. టాప్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలను సంపాదిస్తుంది. రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్‘ సినిమాలో ఒక మంచి క్యారక్టర్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలతో పాటుగా యంగ్ హీరోల సినిమాల్లోనూ నటిస్తూ బిజీ గా గడుపుతుంది.