Big boss Divi : పాపులారిటీ వస్తుందని తెలిసినా అందుకే ఎఫైర్ పెట్టుకోలేదు.. దివీ ఆసక్తికర వ్యాఖ్య

- Advertisement -

Big boss Divi : బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లో అందాలు ఆరబోసి.. ఆ తర్వాత చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ.. పాపులారిటీ సాధించుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్న దివి.. తన లవ్ సీక్రెట్స్ గురించి చెప్పుకువచ్చింది. దివి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు పోస్టులు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఇటీవల దివి ‘లంబసింగి’ సినిమాతో హీరోయిన్‌గా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మార్చి15న థియేటర్స్‌లో విడుదలైంది.

Big boss Divi
Big boss Divi

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి బిగ్‌బాస్ షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడు వెళ్ళకూడదని అనుకున్నాను. అందులోకి వెళ్తే.. కెరీర్ నాశనం అవుతుంది. నాకు వస్తున్న ఆఫర్స్ కూడా ఈ షోకు వెళ్లి వచ్చాక రావేమోనని అనుకున్నాను. అందుకే చాలా మంది సలహా తీసుకున్నాకే బిగ్‌బాస్ షోకు వెళ్ళాను. కానీ పోయేముందే డిసైడ్ అయ్యాను. నేను పాజిటివ్ ఇమేజ్‌తో బయటకు రావాలని డిసైడ్ అయ్యాను. అందుకే ఎఫైర్స్ పెట్టుకోలేదు. బాయ్ ఫ్రెండ్ లేకుండా బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఏకైక అమ్మాయిని నేను మాత్రమే. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చాక నాకు వచ్చిన కొన్ని ఆఫర్లు కూడా చేజారాయి.

DiviVadthya
DiviVadthya

ఒక ప్రాజెక్ట్ ఒకే చేసి పని స్టార్ట్ చేసేవరకు మనది అనుకోవడానికి విల్లేదు. ఎందుకంటే అంతలోనే అదే పాత్రలో వేరేవాళ్లు కూడా నటించే ఛాన్స్ ఉంది. కాబట్టి వచ్చిన ఆఫర్ పోకుండా ఉండాలంటే.. మేకర్స్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలి. అణిగిమణిగి ఉంటేనే వారు పట్టించుకుంటారు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దివి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here