Big Boss 7 Telugu : బిగ్​బాస్ సీజన్​-7కి హోస్టుగా బాలయ్య..!

- Advertisement -

Big Boss 7 Telugu : బిగ్​బాస్​.. ఈ రియాల్టీ షో ఇండియాలో ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఈ షోయే కాదు ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు.. షో హోస్టులు కూడా చాలా ఫేమస్. ప్రతి ఇంటిని అలరించే ఈ కార్యక్రమాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా పాన్ ఇండియా భాషల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీజన్లకు సీజన్లు నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎంటర్​టైన్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తెలుగులో ఈ షోను కాస్త లేటుగా స్టార్ట్ చేసినా లేటెస్ట్​గా షురూ చేశారు. ఈ ఏడాదిలో బిగ్​బాస్​ తెలుగులో 6వ సీజన్ పూర్తి చేసుకుంది. ఇటీవలే ఆరో సీజన్ షో పూర్తి కూడా అయింది. ఇక అప్పటి నుంచి నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ అవుతుంది.. ఈసారి కంటెస్టెంట్లు ఎవరు.. హోస్టు మారతారా.. అనే విషయాలపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.

Big Boss 7 Telugu
Big Boss 7 Telugu

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 తాజాగా ముగిసిన విషయం తెల్సిందే. రేవంత్ ట్రోఫీ గెలవగా శ్రీహాన్ మనీ గెలిచాడు. కంటెస్టెంట్ల ఎంపిక వల్ల ఈ సీజన్​పై మొదటి నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగో అలాగా చివరకు ఫైనల్ ఎపిసోడ్ వరకూ సాగింది. అయితే చివరి వారం మాత్రం కాస్త ఎంటర్​టైనింగ్​ సాగిపోయింది. అయితే చివరి ఎపిసోడ్​పై కూడా చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. సీజన్ ముగిసింది ఇక ఇప్పుడు చర్చంతా వచ్చే సీజన్ గురించే. కంటెస్టెంట్ల విషయం ఎలాగూ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు తెలియదు. కానీ బిగ్​బాస్ 7 సీజన్​కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే సీజన్​7కు ఓ కొత్త హోస్ట్ రాబోతున్నారని.

Balakrishna and Rana

సీజన్ 3 నుంచి మొదలుకుని సీజన్ 6 వరకు నాగార్జున హోస్ట్​గా వ్యవహరించారు. మధ్యలో ఒక ఓటీటీ సీజన్​కు కూడా హోస్ట్​గా వ్యవహరించిన విషయం తెల్సిందే. మొత్తంగా అయిదు సీజన్ లకు నాగార్జున హోస్ట్​గా వ్యవహరించారు. ఇప్పుడు కొత్త సీజన్​కు ఆయన హోస్టింగ్ చేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది.

- Advertisement -

స్టార్ మా వర్గాల సమాచారం ప్రకారం కొత్త సీజన్​కు హోస్టుగా ఇద్దరు ప్రముఖ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. చిత్రమేంటంటే.. ఈ ఇద్దరు హీరోలు కూడా ఇంతకుముందు ఇతర షోలకు హోస్టుగా వ్యవహరించిన వారే. ఆ షోస్ ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ తెచ్చుకున్నాయి కూడా.

ఆహా ఓటీటీలో అన్​స్టాపబుల్ షోతో అన్​స్టాపబుల్​గా దూసుకెళ్తున్న బాలకృష్ణ బిగ్​బాస్​ సీజన్​7కు హోస్టుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే స్టార్​ మా చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. బిగ్​బాస్​కు బాలయ్య హోస్ట్ చేస్తే రోస్టింగ్ మామూలుగా ఉండదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య హోస్ట్ అయితే బిగ్​బాస్ వీక్షకుల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అయితే సీజన్ 7కు హోస్ట్​గా వ్యవహరించడానికి బాలయ్యతో పాటు రానాను కూడా పరిశీలిస్తోందట స్టార్ మా. రానా ఇంతకుముందే జెమిని టీవీ, సన్​నెక్స్ట్ ఓటీటీ కోసం నెంబర్ వన్ యారి అనే ప్రోగ్రామ్​తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే వెండితెర, బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు బిగ్​బాస్ సీజన్ 7 హోస్టుగా వస్తారా అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com