‘బిచ్చగాడు 2’ మొట్టమొదటి రివ్యూ..సెంటిమెంట్ తో కన్నీళ్లు రప్పించేసాడుగా!

- Advertisement -

చిన్న సినిమా గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమాలను ఇది వరకు మనం ఎన్నో చూసాము.వాటిలో తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం కూడా ఒకటి. అప్పట్లో ఈ సినిమా టైటిల్ ని చూసి ఏమి సినిమాలు తీస్తున్నారు రా బాబు అని తిట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.ఆ తర్వాత వాళ్ళే ఈ సినిమా థియేటర్స్ వైపు పరుగులు తీసి బ్లాక్ బస్టర్ హిట్ ని చేసారు.

బిచ్చగాడు 2
బిచ్చగాడు 2

మంచి సినిమా ఇస్తే చాలు తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అని చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది బిచ్చగాడు చిత్రం. ఆరోజుల్లోనే ఈ సినిమా తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా ‘బిచ్చగాడు 2’ తెరకెక్కింది.ఈ నెల 19 వ తారీఖున ఈ చిత్రం విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉన్నది.

ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని చెన్నై లో కొంతమంది సినీ ప్రముఖులు మరియు మీడియా ప్రముఖులకు వేసి చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు విజయ్ ఆంటోనీ ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. కథ విషయానికి వస్తే ఈ చిత్రం మొత్తం డబ్బు మరియు సైన్స్ మధ్య తిరుగుతుంది. అందులో అంతర్లీనంగా సెంటిమెంటల్ సన్నివేశాలు కూడా హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుందట.

- Advertisement -

కచ్చితంగా అది ఆడవాళ్లకు బాగా నచ్చుతుందని చెప్తున్నారు. మొదటి భాగం లో తల్లి సెంటిమెంట్ ని ప్రధానంగా ఫోకస్ చేసి తియ్యగా, రెండవ భాగం లో చెల్లి సెంటిమెంట్ ని ఫోకస్ చేస్తూ తెరకెక్కించారు. మరి మొదటి భాగం లాగానే రెండవ భాగం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు మరియు తమిళం భాషలకు ప్రారంభం అయ్యాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here