Bhumi Pednekar : వెడ్డింగ్ మేగజైన్ కోసం భూమి పెడ్నేకర్ గ్లామర్ ఫొటోషూట్

- Advertisement -

Bhumi Pednekar : భూమి పెడ్నేకర్​.. బాలీవుడ్​లో ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. దమ్ లగా కే హైసా అనే సినిమాతో అంరగేంట్రం చేసిన భూమి.. ఆ మూవీలో ఊబకాయం ఉన్న గృహిణి పాత్రలో అదరగొట్టింది.

Bhumi Pednekar
Bhumi Pednekar

ఈ పాత్ర కోసం భూమి 100కు పైగా కిలోల బరువు పెరిగింది. ఆ తర్వాత సినిమాల కోసం వెంటనే బరువు తగ్గి నాజూగ్గా మారిపోయింది. ఇక అప్పటి నుంచి ఈ భామ ఆఫర్ల కోసం తిరిగి చూడలేదు. వరుస అవకాశాలతో బీ టౌన్​లో యమా స్పీడ్​తో దూసుకెళ్తోంది.

Bhumi Pednekar

అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానాలతో ఈ బ్యూటీ ఎక్కువగా జత కట్టింది. అక్షయ్​తో చేసిన టాయ్​లెట్ ఏక్ ప్రేమ్ కథ సినిమాతో భూమికి మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవలే రక్షాబంధన్​ సినిమాలో అక్షయ్​తో మరోసారి జంటగా నటించింది.

- Advertisement -
Bhumi Pednekar

మొదట్లో కాస్త బొద్దుగా ఉన్న భూమి ఈ మధ్య చాలా స్లిమ్​​గా తయారైంది. ఇక ఈ అమ్మడు ఈమధ్య గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే పెంచేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదు. తరచూ ఫొటోషూట్లతో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతోంది భూమి.

Bhumi Pednekar

తాజాగా భూమి ఖుష్ వెడ్డింగ్ మేగజైన్ కోసం ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోల్లో భూమి దివి నుంచి భువికి దిగివచ్చిన దేవ కన్యలా కనిపిస్తోంది. ఎత్నిక్ వేర్​లో ఈ బ్యూటీ ఎంత అందంగా ఉందో. ఇక మత్తెక్కించే చూపులతో.. కైపెక్కించే పోజులు ఇస్తూ సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచేస్తోంది భూమి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here