Bhuma Mounika Reddy : ఇటీవల కాలం లో సోషల్ మీడియా మొత్తం చర్చనీయాంశంగా మారిన ఘటన మంచు మనోజ్ మరియు భూమా మౌనిక రెడ్డి వివాహం చేసుకోవడం.ఈ పెళ్లి అటు మనోజ్ కి ఇటు భూమా మౌనిక కి ఇద్దరికీ రెండవ పెళ్లే.మౌనిక రెడ్డి కి ఒక చిన్న కొడుకు కూడా ఉన్నాడు,తన మొదటి భర్త గణేష్ తో విడాకులు తీసుకున్న తర్వాత మనోజ్ పరిచయం అవ్వడం,ఆ తర్వాత ఇద్దరూ బాగా క్లోజ్ అవ్వడం,ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.

పెళ్ళికి ముందు వీళ్లిద్దరు సుమారుగా 5 ఏళ్ళ నుండి డేటింగ్ లో ఉన్నారట.వీళ్లిద్దరి కలవడం వల్ల మంచు కుటుంబం రెండుగా చీలిపోయిందని,మంచు విష్ణు తో గొడవలు అయ్యి మనోజ్ సెపెరేట్ అయ్యిపోయాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ప్రచారం అవ్వడం మనం గమనించే ఉంటాము, ఇవన్నీ నిజం అని నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు.

అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చే మంగళవారం ఈటీవీ లో ప్రసారం అవ్వబొయ్యే ‘అలా మొదలైంది’ అనే ప్రోగ్రాం లో దొరకనుండి అని తెలుస్తుంది.ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కొంత కాలం క్రితమే ప్రారంభం అయ్యింది.ఈ షో కి ఇదివరకే పలువురు సెలెబ్రిటీ కపుల్స్ హాజరయ్యారు.ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ కి మంచు మనోజ్ మరియు మౌనికా రెడ్డి హాజరయ్యారు.

ఈ ఎపిసోడ్ లో వెన్నెల కిషోర్ మనోజ్ – మౌనిక ప్రేమ ఎలా మొదలైంది, భూమా మౌనిక రెడ్డి ని పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ ఎలాంటి పరిణామాలు ఎదురుకున్నాడు వంటి ప్రశ్నలను అడిగాడు వెన్నెల కిషోర్. మౌనిక మాట్లాడుతూ ‘చాలా మంది మనోజ్ గారి కోపాన్ని నేను ఎలా తట్టుకుంటానో అని భయపడేవారు. కానీ ఇక్కడ పాపం మనోజ్ గారు నా కోపాన్ని తట్టుకోవడం చాలా కష్టం అయిపోయింది’ అని చెప్పింది.అలా కాసేపు సరదాగా, కాసేపు ఎమోషనల్ గా సాగిపోయిన ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.