Bhagavanth Kesari : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలై అద్భుతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ, ఓపెనింగ్స్ యావరేజి రేంజ్ లోనే వచ్చాయి. టాక్ బాగా వచ్చింది కదా, కనీసం రెండవ రోజు నుండి అయినా పికప్ అవుతుంది అనుకున్నారు ట్రేడ్ పండితులు.
కానీ రెండవ రోజు కూడా బీలో యావరేజి వసూళ్లను సొంతం చేసుకుంది. నూన్ మరియు మ్యాట్నీ షోస్ బాగా డల్ అయ్యాయి కానీ, సాయంత్రం షోస్ పర్వాలేదు అనిపించాయి. ఇక సెకండ్ షోస్ అయితే దాదాపుగా అన్నీ ప్రాంతాలలో బాగానే హౌస్ ఫుల్ పడ్డాయి. కానీ ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి ఈ వసూళ్లు ఏ మాత్రం సరిపోవు. ప్రస్తుతం ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ రేంజ్ లో ఉన్నాయి.
‘భోళా శంకర్’ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ మెగాస్టార్ కి ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగా అంత ఫ్లాప్ టాక్ లో కూడా ఈ చిత్రానికి మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ భగవంత్ కేసరి చిత్రానికి మాత్రం కేవలం 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి.
ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రానికి కేవలం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. భోళా శంకర్ చిత్రానికి రెండవ రోజు దాదాపుగా 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ భగవంత్ కేసరి కి ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ ఏంటంటే, ఈ చిత్రానికి వచ్చే మంగళవారం వరకు సెలవు దినాలు ఉన్నాయి. కాబట్టి క్లోసింగ్ లో కచ్చితంగా భోళా శంకర్ కంటే ఎక్కువ వసూళ్లే వస్తాయి.