Bhagavathth kesari : చిరంజీవి డిజాస్టర్ సినిమా వసూళ్లను కూడా చేరుకోలేకపోయిన భగవంత్ కేసరి!

- Advertisement -

భ‌గ‌వంత్ కేస‌రి మూవీ గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తొలిరోజు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా 32. 33 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. బాలకృష్ణ మూవీ ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ అనౌన్స్‌మెంట్‌తో సోష‌ల్ మీడియాలో మెగా, నంద‌మూరి అభిమానుల మ‌ధ్య వార్ మొద‌లైంది.

Bhagavathth kesari
Bhagavathth kesari

చిరంజీవి భోళాశంక‌ర్‌తో భ‌గ‌వంత్ కేస‌రిని క‌లెక్ష‌న్స్‌ను కంపేర్ చేస్తూ ప‌లువురు మెగా అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. బాల‌కృష్ణ మూవీ చిరంజీవి ఫెయిల్యూర్ సినిమా వ‌సూళ్ల‌ను కూడా దాట‌లేక‌పోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి భోళా శంకర్ మూవీ తొలి రోజు 33 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ఆ సినిమా యూనిట్ అప్పట్లో రిలీజ్ చేసిన పాత పోస్టర్స్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. క‌లెక్ష‌న్స్‌లో మాత్ర‌మే కాకుండా అడ్వాన్స్ బుకింగ్స్‌లో భ‌గ‌వంత్‌కేస‌రిని భోళాశంక‌ర్ డామినేష‌న్ చేసింద‌ని ప‌లువురు మెగా అభిమానులు ట్విట్ట‌ర్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

bholashaankar

ఈ రెండు సినిమాల క‌లెక్ష‌న్స్‌ను కంపేర్ చేస్తూ ఫ్యాన్స్ చేసిన ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. భ‌గ‌వంత్ కేస‌రికి పోటీగా ద‌స‌రాకు విజ‌య్ లియో, ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాలు రిలీజ‌య్యాయి. ఈ భారీ బ‌డ్జెట్ సినిమాల పోటీ కార‌ణంగా భ‌గ‌వంత్ కేస‌రి తొలిరోజు వ‌సూళ్లు అనుకున్న‌దానికంటే త‌క్కువ‌గా వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. బాల‌కృష్ణ కెరీర్‌లొనే హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన సినిమాల్లో ఒక‌టిగా భ‌గ‌వంత్ కేస‌రి నిలిచింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here