Yaash : రణబీర్ రామాయణంలో రావణుడిగా యష్.. ఆయన రెమ్యునరేషన్ భారీ బడ్జెట్ సినిమా అంత

- Advertisement -

Yaash : భారత ఇతిహాసం రామయణాన్ని ఎన్ని సార్లు వెండితెరపై చూసిన మరల మరల చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. మరో సారి రామాయణం తెరకెక్కబోతుంది. ప్రముఖ చిత్ర నిర్మాత నితీష్ తివారి ఈ రామాయణాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అనేక రకాల వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో యష్ రావణుడి పాత్రను పోషిస్తాడని, దీనికి భారీ రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Yaash
Yaash

రామాయణంలో రావణుడిగా నటించినందుకు యష్ దాదాపు 150 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. ఇది కూడా ఫిక్స్ డ్ అమౌంట్ ఏం కాదట. షూట్ ఎంతకాలం సాగుతుందనే దానిపై కూడా రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. కేజీఎఫ్ 3 త్వరలో తెరకెక్కబోతుందని… ఆ సినిమా తర్వాత రామాయణంలో ఆయన పాలు పంచుకుంటారని తెలుస్తోంది.

ramayana

ఈ చిత్రం కోసం యష్ పూర్తిగా భిన్నంగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. సీత పాత్రలో అలియా భట్ కనిపించనుందని కొంతకాలం క్రితం వార్తలు వినిపించాయి. అయితే డేట్స్ సమస్య వల్ల అది జరగడం లేదు. ఆ తర్వాత సాయి పల్లవి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. వార్తల ప్రకారం ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here